మా ఇంటి బంగారం వచ్చేస్తోంది.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ | Samantha Maa Inti Bangaaram Ott Streaming date locked | Sakshi
Sakshi News home page

Maa Inti Bangaaram Ott: నెల రోజుల్లోపే ఓటీటీకి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Jul 12 2026 6:41 PM | Updated on Jul 12 2026 6:41 PM

Samantha Maa Inti Bangaaram Ott Streaming date locked

సమంత లీడ్ రోల్లో వచ్చిన లేడీ ఓరియంటెడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మా ఇంటి బంగారం. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్ టాక్‌తో మూడు వారంలోనూ వసూళ్లపరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఘనత సాధించింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేశారు. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ విషయాన్ని జియో హాట్‌స్టార్ ప్రకటించింది. థియేటర్లలో వందకోట్లు కొల్లగొట్టిన మా ఇంటి బంగారం ఓటీటీలోనూ దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. 
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement