'అది మీ పిరికితనమే'.. రాధిక శరత్‌కుమార్ ఆగ్రహం | Radhika tweet about Trolling on Khushboo Daughters | Sakshi
Sakshi News home page

Radhika: ఖుష్బు కుమార్తెలకు అండగా రాధిక ట‍్వీట్

Jul 12 2026 3:23 PM | Updated on Jul 12 2026 3:52 PM

Radhika tweet about Trolling on Khushboo Daughters

టాలీవుడ్ సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీల పిల్లలను ఎగతాళి చేయడం వాక్ స్వాతంత్ర్యం కాదని మండిపడింది . ప్రముఖుల కుమార్తెలను ఎగతాళి చేయడం హాస్యం కాదని తెలిపింది. ఇది కేవలం మీ పిరికితనమేనని ఎద్దేవా చేసింది. మనకు అవతలి వాళ్ల రూపం కంటే.. వ్యక్తిత్వమే చాలా ముఖ్యమని ట్వీట్‌లో రాసుకొచ్చింది. కాగా..గతంలో చాలాసార్లు ఖుష్బు కూతుర్లను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి తనదైన శైలిలో కౌంటరిచ్చింది. 

దీంతో నటి ఖుష్బు కుమార్తెలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై రాధిక శరత్‌ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడింది. సెలబ్రిటీల పిల్లలను టార్గెట్ చేయడం పిరికిపంద చర్య గట్టిగానే కౌంటరిచ్చింది. వాక్ స్వాతంత్ర్యం అంటే బెదిరించే స్వేచ్ఛ కాదని తెలిపింది. విమర్శించడం అనేది క్రూరత్వం కాదు.. హాస్యం అవమానించడం కాదని హితవు పలికింది. నేను ఖుష్బూ, ఆమె కుమార్తెలకు అండగా నిలుస్తానని పేర్కొంది. ఎవరైనా సరే ఇలాంటి ప్రవర్తన ఎక్కడ జరిగినా సరే తాను ఖండిస్తానని రాధిక శరత్‌కుమార్ స్పష్టం చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement