breaking news
Khushbhu Sundar
-
'అది మీ పిరికితనమే'.. రాధిక శరత్‌కుమార్ ఆగ్రహం
టాలీవుడ్ సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీల పిల్లలను ఎగతాళి చేయడం వాక్ స్వాతంత్ర్యం కాదని మండిపడింది . ప్రముఖుల కుమార్తెలను ఎగతాళి చేయడం హాస్యం కాదని తెలిపింది. ఇది కేవలం మీ పిరికితనమేనని ఎద్దేవా చేసింది. మనకు అవతలి వాళ్ల రూపం కంటే.. వ్యక్తిత్వమే చాలా ముఖ్యమని ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా..గతంలో చాలాసార్లు ఖుష్బు కూతుర్లను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి తనదైన శైలిలో కౌంటరిచ్చింది. దీంతో నటి ఖుష్బు కుమార్తెలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై రాధిక శరత్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడింది. సెలబ్రిటీల పిల్లలను టార్గెట్ చేయడం పిరికిపంద చర్య గట్టిగానే కౌంటరిచ్చింది. వాక్ స్వాతంత్ర్యం అంటే బెదిరించే స్వేచ్ఛ కాదని తెలిపింది. విమర్శించడం అనేది క్రూరత్వం కాదు.. హాస్యం అవమానించడం కాదని హితవు పలికింది. నేను ఖుష్బూ, ఆమె కుమార్తెలకు అండగా నిలుస్తానని పేర్కొంది. ఎవరైనా సరే ఇలాంటి ప్రవర్తన ఎక్కడ జరిగినా సరే తాను ఖండిస్తానని రాధిక శరత్‌కుమార్ స్పష్టం చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Freedom of speech is not freedom to bully. Criticism is not cruelty. Humour is not humiliation.Mocking a public figure's daughters is not comedy — it is cowardice. Looks are not an achievement or a failure. Character is.I stand with Khushbu and her daughters. I condemn this… pic.twitter.com/Dn7WjXRYUU— Radikaa Sarathkumar (@realradikaa) July 11, 2026 -
ఖుష్బు సుందర్ కుమార్తె వెడ్డింగ్.. టాలీవుడ్ తారల సందడి
ప్రముఖ నటి ఖుష్బు సుందర్ ఇంట శుభకార్యం జరిగింది. ఆమె కూతురు పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినితారలు సందడి చేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా పాల్గొన్నారు. అంతేకాకుండా టాలీవుడ్ హీరోలు వెంకటేశ్, నాగార్జున కూడా హాజరయ్యారు. కోలీవుడ్ భామ త్రిష సైతం ఈ పెళ్లి వేడుకలో మెరిసింది. కాగా.. ఖుష్బు సుందర్ తమిళంతో పాటు తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చిరంజీవి హీరోగా వచ్చిన స్టాలిన్ చిత్రంలో ఖుష్బు సుందర్ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలో మెగాస్టార్‌కు అక్క పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె రాజకీయాలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. ముగ్గురు మొనగాళ్లు in Goa#Chiranjeevi,#Nagarjuna & #Vanktesh attends #KhushbuSundar Daughter's marriage in GoaVintage Style - Vetaran Swag pic.twitter.com/6vPg2xjK6h— Taraq(Tarak Ram) (@tarakviews) June 25, 2026 #Khushbusundar గారి కుమార్తె వివాహా వేడుకకు హాజరయ్యేందుకు గోవా కు బయలుదేరి వెళ్లిన#Chiranjeevi #Nagarjuna కుటుంబాలు.@KChiruTweets @iamnagarjuna pic.twitter.com/3oMV1ZZZ0M— SZN (@Suzenbabu) June 24, 2026 -
తమిళనాడులో కలకలం.. సీఎం సహా ముగ్గురి ఇళ్లకు బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడులో సీఎం స్టాలిన్ సహా పలువురు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేశారు. అనంతరం, అది ఫేక్ బెదిరింపు మొయిల్ అని పోలీసులు నిర్ధారించారు.వివరాల ప్రకారం.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బు నివాసానికి ఆదివారం రాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం నివాసం సహా నాలుగు ప్రదేశాలలో భద్రతా తనిఖీలు చేపట్టారు. ఇళ్లు, పరిసర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కొన్ని గంటల పాటు సోదాలు జరిగాయి. తనిఖీ సమయంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది ఫేక్ మొయిల్ అని నిర్దారించారు. కాగా, బెదిరింపు పంపిన వ్యక్తి గురించి ఎలాంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు.మరోవైపు.. ఇటీవలి కాలంలో తమిళనాడు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. కొందరు ఆకతాయిలు ఇలా ఫేక్ కాల్స్, ఫేక్ మొయిల్స్ పెట్టి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత వారం కూడా చెన్నైలోని ఇంజంబక్కంలోని అజిత్ కుమార్ నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి నుండి బాంబు బెదిరింపు వచ్చింది. అంతకుముందు.. నటుడు అరుణ్ విజయ్, ఇళయరాజా స్టూడియోకు సైతం ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి.Bomb threat to Tamil Nadu Chief Minister MK Stalin and actors Ajith Kumar, Khushbu Sundar. India Today's @PramodMadhav6 with more details#TamilNadu #Bombthreat #TheBurningQuestion @anchorAnjaliP pic.twitter.com/bpuxQqwHSJ— IndiaToday (@IndiaToday) November 17, 2025 -
స్టార్ హీరోయిన్ కూతురి బర్త్ డే.. నటి ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్ నటి ఖుష్బూ సుందర్ తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. విక్టరీ వెంకటేశ్ హీరోగానటించిన ‘కలియుగ పాండవులు’అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్ హిట్. ఆ తర్వాత తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. దాదాపు తమిళ స్టార్స్ అందరితో ఖుష్బూ కలిసి నటించారు. గతేడాది గోపిచంద్ నటించిన రామబాణం చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఖుష్బు.. చాలా అరుదుగా సినిమాల్లో కనిపిస్తున్నారు. అయితే నటుడు సుందర్‌ను పెళ్లాడిన ఖుష్బుకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. (ఇది చదవండి: నటి ఖుష్బూ కూతురును చూశారా..ఎంత అందంగా ఉందో) తాజాగా తన కూతురు బర్త్ డే సందర్భంగా ఖుష్బు ట్వీట్ చేసింది. తన చిన్నారి తల్లికి అప్పుడే 21 ఏళ్లు నిండాయా అంటూ భావాద్వేగానికి లోనైంది. నీ అందం, చిరునవ్వు చూస్తే చాలు ఎంతో ఆనందంగా ఉంటుందని రాసుకొచ్చారు. నువ్వు నా కడుపులో పెరిగిన రోజు నుంచి.. ఇప్పటివరకు నీపై ప్రేమ తగ్గలేదని ట్వీట్ చేశారు. లవ్యూ మై బొమ్మై అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఖుష్బు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తమ అభిమాన నటి కూతురు అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. My baby. My adorable little one. All of 21 today. You grew up suddenly. From a little cutie button to literally towering over me, you have not given me a single sleepless night. You have been an angle. Your smile, your eyes, your dimple, your hug, your sweet nothings, all are so… pic.twitter.com/cAU0yvqHG7 — KhushbuSundar (@khushsundar) January 25, 2024 -
ఇది బీజేపీ విజయం కాదు: ఖుష్బూ
ట్రిపుల్ తలాక్ విజయాన్ని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ సుందర్ అన్నారు. విజయం ఏదైనా దాని క్రెడిట్ తమకే దక్కాలని బీజేపీ భావిస్తోందని చెప్పారు. ట్రిపుల్ తలాక్ విజయం బీజేపీ క్రెడిట్ కాదని అన్నారు. ఇది భారతీయ మహిళల విజయమని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. 'సుప్రీంకోర్టు విడాకులపై నిషేధం విధించలేదు. కానీ, అప్పటికప్పుడు తలాక్ చెప్పే పద్దతిపై నిషేధం విధించింది. 'పర్సనల్ లా'లు ఆర్టికల్ 25 కింద ఇంకా అమల్లోనే ఉంటాయి.' అని ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యడు కమల్ ఫారుఖీ అన్నారు.


