స్టార్ హీరోయిన్ కూతురి బర్త్‌ డే.. నటి ఎమోషనల్‌ పోస్ట్! | Star Heroine Daughter Birthday Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోయిన్ కూతురి బర్త్‌ డే.. ఆమె ఎవరో గుర్తుపట్టారా?

Jan 25 2024 7:45 PM | Updated on Jan 25 2024 8:01 PM

Star Heroine Daughter Birthday Post Goes Viral On Social Media - Sakshi

కోలీవుడ్ నటి ఖుష్బూ సుందర్ తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. విక్టరీ వెంకటేశ్‌ హీరోగానటించిన ‘కలియుగ పాండవులు’అనే చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్‌ హిట్‌.

ఆ తర్వాత తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. దాదాపు తమిళ స్టార్స్‌ అందరితో ఖుష్బూ కలిసి నటించారు. గతేడాది గోపిచంద్ నటించిన రామబాణం చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఖుష్బు.. చాలా అరుదుగా సినిమాల్లో కనిపిస్తున్నారు. అయితే నటుడు సుందర్‌ను పెళ్లాడిన ఖుష్బుకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.  

(ఇది చదవండి: నటి ఖుష్బూ కూతురును చూశారా..ఎంత అందంగా ఉందో)

తాజాగా తన కూతురు బర్త్‌ డే సందర్భంగా ఖుష్బు ట్వీట్ చేసింది. తన చిన్నారి తల్లికి అ‍ప్పుడే 21 ఏళ్లు నిండాయా అంటూ భావాద్వేగానికి లోనైంది. నీ అందం, చిరునవ్వు చూస్తే చాలు ఎంతో ఆనందంగా ఉంటుందని రాసుకొచ్చారు. నువ్వు నా కడుపులో పెరిగిన రోజు నుంచి.. ఇప్పటివరకు నీపై ప్రేమ తగ్గలేదని ట్వీట్‌ చేశారు. లవ్‌యూ మై బొమ్మై అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఖుష్బు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తమ అభిమాన నటి కూతురు అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement