బన్నీకి అభిమాని రిక్వెస్ట్.. వెంటనే రిప్లై ఇచ్చేశాడు! | Tollywood Hero Allu Arjun Responds To Fan Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun: బన్నీకి అభిమాని రిక్వెస్ట్.. వెంటనే స్పందించాడు!

Oct 24 2024 1:35 PM | Updated on Oct 24 2024 1:41 PM

Tollywood Hero Allu Arjun Responds To Fan Tweet Goes Viral

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప-2 కౌంట్‌డౌన్ స్టార్ అయిపోయింది. మరో కొద్ది రోజుల్లో థియేటర్లలో పుష్పరాజ్‌ సందడి చేయనున్నాడు. డిసెంబర్ 6న థియేటర్లతో పాటు పలు రికార్డులు బద్దలు కానున్నాయి. ప్రస్తుతం పుష్ప టీమ్ పోస్ట్ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉంది.

ఈ సంగతి పక్కన పెడితే బన్నీకి ఉ‍న్న ఫ్యాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియానే మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇటీవల ఓ అభిమాని ఏకంగా యూపీ నుంచి సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. బన్నీని కలిసి ఆనందం వ్యక్తం చేశారు.

(ఇది చదవండి: నేడు మీడియా ముందుకు 'పుష్ప2' యూనిట్‌)

తాజాగా ఓ అభిమాని తన బర్త్‌ డే కావడంతో ఎక్స్ వేదికగా ఓ రిక్వెస్ట్ పెట్టాడు. మీకు చిన్నప్పటి నుంచి అభిమానిని.. ఇవాళ నా పుట్టినరోజు.. మీ నుంచి విషెస్ వస్తే నాకదే సంతోషం అంటూ అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేశాడు. ఇది చూసిన బన్నీ వెంటనే అతనికి రిప్లై ఇచ్చాడు. హ్యాపీ బర్త్‌ డే అంటూ తన అభిమానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇది చూసిన అతను లవ్‌ యూ అన్న.. థ్యాంక్యూ సో మంచ్‌ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఏదేమైనా పాన్ ఇండియా హీరో ఫ్యాన్ ట్వీట్‌కు స్పందించడం అంటే బన్నీ సింప్లిసిటీ ఏంటో అర్థమవుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement