
జయసుధ (Jayasudha) తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు వంటి ప్రముఖులతో కలిసి ఎన్నో సినిమాలు చేసింది. ప్రస్తుతం తల్లిగా, అత్తగా సహాయక పాత్రలు పోషిస్తోంది. వెండితెరపై తిరుగులేని నటిగా కీర్తి గడించిన ఈమె జీవితాన్ని 2017లో జరిగిన ఓ సంఘటన ఒక్కసారిగా కుదిపేసింది. అదే ఆమె భర్త, నిర్మాత నితిన్ కపూర్ ఆత్మహత్య! ఈ ఘటనతో ఆమె కొంతకాలంపాటు డిప్రెషన్‌కు వెళ్లిపోయింది.
అదే నాన్న బాధ
నితిన్ అలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణాన్ని అతడి తనయుడు, నటుడు నిహార్ కపూర్ (Nihar Kapoor) వెల్లడించాడు. నిహార్ కపూర్ మాట్లాడుతూ.. నాన్నకు చిన్నవయసులోనే డయాబెటిస్ వచ్చింది. అయితే ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాడు. జిమ్‌కు వెళ్లేవాడు. అయితే నాన్న నిర్మాతగా తీసిన సినిమాలు కొన్ని ఆడాయి. కొన్ని ఫెయిలయ్యాయి. అసలేవి చేసినా సక్సెస్ అవడం లేదు. ఓ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే మధ్యలోనే ఆగిపోయింది.

నాశనం చేస్తున్నానా?
మరో సినిమా బాలీవుడ్ నిర్మాత ఎత్తుకుపోయాడు.. ఇలా చాలా విషయాలు ఆయన్ని ఎంతగానో బాధపెట్టాయి. నెమ్మదిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. డిప్రెషన్‌లో ఉన్నవారికి.. నా వల్ల నా చుట్టూ ఉన్నవాళ్లు బాధపడతారు. వారి జీవితాన్ని నేనే నాశనం చేస్తున్నాను వంటి ఆలోచనలు వస్తాయి. నాన్న విషయంలో అదే జరిగింది. ఏళ్ల తరబడి డిప్రెషన్‌లో ఉన్నారు.
10 ఏళ్లుగా అదే మాట
చనిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. చచ్చిపోతానని దాదాపు 10 ఏళ్లుగా చెప్తూనే ఉన్నారు. ఒకరోజు ముంబైలో తన బంగ్లాపై నుంచి దూకాడు. నిజానికి ఇది జరగడానికి ముందే ఓ ఫంక్షన్‌కు వెళ్లాలని కొత్త బట్టలు కొన్నాడు. అంతలోనే ప్రాణం తీసుకున్నాడు. ఆ బాధలో నుంచి బయటకు రావడానికి అమ్మకు చాలా సమయం పట్టింది అని నిహార్ కపూర్ చెప్పుకొచ్చాడు. నిహార్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాలో నటించాడు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్!