ఆ ఆనందమే వేరు: తరుణ్‌ భాస్కర్‌ | Director Tarun Bhaskar about Om Shanti Shanti Shanti movie | Sakshi
Sakshi News home page

ఆ ఆనందమే వేరు: తరుణ్‌ భాస్కర్‌

Feb 1 2026 12:22 AM | Updated on Feb 1 2026 12:22 AM

Director Tarun Bhaskar about Om Shanti Shanti Shanti movie

‘‘యాక్టర్‌గా వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ నా ప్రయారిటీ డైరెక్షనే. ఒక క్రియేటివ్‌ థాట్‌తో కథ రెడీ చేసుకుని, ఆ  కథను స్క్రీన్‌పై చూసుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఈ ఏడాది నేను నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. వీటి తర్వాత దర్శకత్వంపై మరింత ఫోకస్‌ పెడతాను’’ అని తరుణ్‌ భాస్కర్‌ చె΄్పారు. తరుణ్‌ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళ హిట్‌ ఫిల్మ్‌ ‘జయ జయ జయ జయహే’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఏఆర్‌ సజీవ్‌ దర్శకత్వంలో సృజన్‌ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్‌ కృష్ణని, అనూప్‌ చంద్రశేఖరన్, సాధిక్‌ షేక్, నవీన్‌ సనివరపు నిర్మించిన ఈ చిత్రం జనవరి 30న విడుదలైంది. 

ఈ సందర్భంగా తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను చూసిన ఆడియన్స్‌ ఇదొక ఒరిజినల్‌ సినిమాలానే ఫీలవుతున్నారు. కథకు కనెక్ట్‌ అవుతున్నారు. ఈ సినిమాలో ఓంకార్‌ నాయుడు పాత్ర చేశాను. యాక్టర్‌గా నేనిప్పటివరకు చేసిన రోల్స్‌లో నాకు ఇది చాలెంజింగ్‌. నేను పుట్టి పెరిగింది అంతా తెలంగాణలోనే. కానీ ఓంకార్‌ నాయుడు పాత్ర గోదావరి యాస మాట్లాడాలి.

నా మిత్రుడు వర్మ, లాంగ్వేజ్‌ కోచ్‌ వినోద్‌గార్ల సహాయంతో ఈ రోల్‌ చేశాను. డైలాగ్స్‌ లేకుండా ఎమోషన్‌ చూపించడం టఫ్‌. ఈషా ఈ పాత్రను అద్భుతంగా చేసింది. ఈ సినిమా క్రెడిట్‌ అంతా సజీవ్‌దే. ‘ఈ నగరానికి ఏమైంది?’ పార్టు 2 చిత్రీకరణ జరుగుతోంది. 30 ఏళ్లు దాటిన తర్వాత అబ్బాయిలకు ఉండే సమస్యలు, టెన్షన్స్‌తో ఈ సినిమా కథ సాగుతుంది. వెంకటేశ్‌గారు హీరోగా నా డైరెక్షన్‌లోని సినిమాకు ఇంకా వర్క్‌ చేయాలి’’ అని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement