
బుల్లితెర యాంకర్ నుంచి వెండితెర నటిగా ఎదిగింది అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) రంగస్థలం, పుష్ప, పుష్ప 2, ప్రేమవిమానం, రజాకార్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఫ్లాష్‌బ్యాక్, వోల్ఫ్ అనే తమిళ మూవీస్‌లో యాక్ట్ చేస్తోంది. సినిమాల్లో బిజీ అవడంతో బుల్లితెరకు గుడ్‌బై చెప్పేసి వెండితెరపైనే సెటిలైపోయింది.
అనసూయపై ట్రోలింగ్
అయితే అనసూయ ఏది మాట్లాడినా ట్రోల్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండపై అనసూయ నెగెటివ్ కామెంట్స్ చేసినప్పటి నుంచి అతడి అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అలాగే 40 ఏళ్ల వయసున్న తనను ఆంటీ అని పిలవొద్దని చెప్తున్నా సరే సోషల్ మీడియాలో నెటిజన్లు తనను పదేపదే ఆంటీ అని పిలుస్తూ చిరాకు తెప్పిస్తూనే ఉన్నారు.

అంతమందిని బ్లాక్ చేశా
ఈ ట్రోలింగ్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ స్పందించింది. ఎవరైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను వారిని వెంటనే బ్లాక్ చేస్తాను. అలా దగ్గరదగ్గర 3 మిలియన్ల మందిని బ్లాక్ చేశాను. వారి కామెంట్లకు కౌంటర్ ఇచ్చినప్పటికీ.. ఒకానొక సమయంలో అదంతా భరించలేకపోయాను. నా జీవితంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే నువ్వు లేవు, ఇకమీదట కూడా రావు అనుకుని బ్లాక్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్లపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది.
3 మిలియన్స్ 30 లక్షలని తెలుసా?
'3 మిలియన్స్ అంటే మూడు వేలు అనుకుందేమో 30 లక్షలని ఎవరైనా చెప్పండ్రా..', 'చెప్తే నమ్మేటట్లుండాలి.. హీరోయిన్లకే 30 లక్షల మంది జనాలు మెసేజ్ చేయరు, అలాంటిది నీకు అంతమంది మెసేజ్, కామెంట్స్ చేశారంటే నమ్మాలా?', 'ఇవన్నీ చేయడం కన్నా నీ అకౌంట్ డిలీట్ చేస్తే అయిపోతుందిగా!', '3 మిలియన్ల జనాల్ని బ్లాక్ చేస్తూ పోయానంటున్నారు, అంత ఖాళీగా ఉన్నారా?' అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 16 లక్షల ఫాలోవర్లు ఉంటే 30 లక్షల మందిని ఎలా బ్లాక్ చేసిందని ప్రశ్నిస్తున్నారు.