
హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). 32 ఏళ్ల ఈ మహారాష్ట్ర బ్యూటీ సీతారామం చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఠాగూర్‌కు అక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా సీతారామం చిత్రం తమిళంలోనూ అనువాదమై అక్కడా మంచి గుర్తింపు లభించింది. దీంతో కోలీవుడ్‌లోనూ అవకాశాలు తలుపుతట్టాయి.
అలా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మదరాశి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఏమైందో ఏమోకానీ, ఆ అవకాశాన్ని మృణాల్ ఠాకూర్ చేజార్చుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు తమిళ చిత్రపరిశ్రమ ఆమె వైపు చూడడం లేదు. ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో డకాయిట్ మూవీలో యాక్ట్ చేస్తోంది.
అదేవిధంగా అల్లు అర్జున్ సరసన నటించే మరో లక్కీఛాన్స్ ఈ బ్యూటీని వరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పెళ్లి గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలన్నది తన చిన్న వయసు నుంచే కల అని పేర్కొంది. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా చిత్ర పరిశ్రమపైనే ఉందని, సినిమాల్లో బాగా సక్సెస్ అవ్వాలని తెలిపింది.
చదవండి: కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్‌మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్