
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Kalyani Priyadarshan) లేకపోయుంటే తాను ఏమైపోయేదాన్నో అంటోంది హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. తనకు ఏ అవసరమొచ్చినా, ఎటువంటి సలహా కావాలన్నా ఎప్పుడూ అతడు అందుబాటులో ఉంటాడని చెప్తోంది. నేడు (జూలై 28) దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కల్యాణి సోషల్ మీడియాలో వేదికగా హీరోకు బర్త్‌డే విషెస్ తెలిపింది. ప్రియమైన D(దుల్కర్), ప్రతి ఏడాది నీకు సోషల్ మీడియాలో కాకుండా నేరుగా ఓ పెద్ద మెసేజ్ పంపుతాను.
నేనెప్పుడూ ఒంటరిదాన్ని కాను
కానీ ఈ సారి మన కలల ప్రపంచానికి సంబంధించిన (మూవీ) గ్లింప్స్ అందరితో షేర్ చేసుకోబోతున్నాం. అందుకే ఈ పోస్ట్.. నిజ జీవితంలో, సినీ ప్రపంచంలో నువ్వు కన్న ప్రతి కల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ఐదేళ్లుగా నాకు ఏ సలహా కావాలన్నా ఫస్ట్ ఫోన్ నీకే చేస్తాను. అంతలా నాకు సపోర్ట్‌గా నిలబడ్డందుకు థాంక్యూ. నువ్వు లేకపోయుంటే నేనేమైపోయేదాన్నో నాకే తెలీదు. ఒకరకంగా చెప్పాలంటే నేను ఒంటరిదాన్ని కాదు అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.

అప్పటినుంచే స్నేహం
దుల్కర్, కల్యాణి.. 2020లో వచ్చిన మలయాళ చిత్రం 'వరణే అవశ్యముంద్'లో జంటగా నటించారు. అప్పుడే వీరు క్లోజ్ ఫ్రెండ్సయ్యారు. అప్పటినుంచి వీరి స్నేహం అలాగే కొనసాగుతూనే ఉంది. నేడు దుల్కర్ బర్త్‌డే సందర్భంగా.. అతడు నిర్మాతగా వ్యవహరిస్తున్న లోక, చాప్టర్ 1: చంద్ర సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ బ్యూటీ తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం సినిమాలు చేసింది.