అజిత్‌ కేరవాన్‌లో వంట చేసిపెట్టాడు: తమన్నా | Tamannaah Bhatia Reveals Career Highlights, Praises Vijay And Jr NTR And Says Ajith Is Like A Family Member | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు ఆ హీరో బెస్ట్‌ డ్యాన్సర్‌

Mar 16 2026 8:57 AM | Updated on Mar 16 2026 9:05 AM

Tamannaah Bhatia Says Ajith is like a Family Member

సినిమారంగంలో భాషాబేధాలకు తావుండదు. ప్రతిభే కొలమానం. అలా స్వశక్తితో ఎదిగిన నటీమణుల్లో మిల్కీబ్యూటీ తమన్నా భాటియా ఒకరు. ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాదిలో అగ్ర హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. కథానాయికగా సత్తా చాటుతూనే మరోపక్క ఐటమ్‌ సాంగ్స్‌లో నటిస్తూ అలరిస్తోంది. అలా ప్రత్యేక పాటల కోసం తమన్నా దాదాపు రూ.6 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్‌!

ఆ మూవీ ఎంతో స్పెషల్‌
ఇకపోతే ఈ హీరోయిన్‌ ఇటీవల చెన్నైలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను తమిళంలో కల్లూరి చిత్రంలో నటించానని, అది తన సినీజీవితంలో చాలా ముఖ్యమైనదని పేర్కొంది. ఆ సినిమాలోలాగే కాలేజీ లైఫ్‌ను విద్యార్థులు ఎంజాయ్‌ చేయాలంది. కాలేజీడేస్‌ మళ్లీ తిరిగిరావంది.

స్వయంగా వంట చేసి..
తాను సినీ పరిశ్రమలో 21 ఏళ్లుగా కొనసాగుతున్నానని, ఇంతలా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని సంతోషం వ్యక్తం చేసింది. తమిళంలో విజయ్‌, అజిత్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించినట్లు తెలిపింది. నటుడు విజయ్‌ చాలా నిరాడంబరుడు, మంచి మనసు కలవాడంది. విజయ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ బెస్ట్‌ డ్యాన్సర్స్‌ అని కితాబిచ్చింది. అజిత్‌ గురించి చెప్పాలంటే వీరం సినిమా సమయంలో తనకు ఆయన కేరవాన్‌లో ఇడ్లీ వండిపెట్టారని గుర్తు చేసుకుంది. ఆయనకు వంట చేయడం చాలా ఇష్టమని, మంచి కుటుంబ సభ్యుడిలా ఉంటాడని పేర్కొంది.

చదవండి: ఆస్కార్‌ పండగ.. అత్యధికంగా ఆ చిత్రానికే ఎక్కువ అవార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement