ఖుష్బు సుందర్ కుమార్తె వెడ్డింగ్.. టాలీవుడ్ తారల సందడి | Tollywood celebrities at Baby Khushboo Sundar Daughter marriage | Sakshi
Sakshi News home page

Khushboo Sundar: ఖుష్బు సుందర్ కుమార్తె పెళ్లి.. టాలీవుడ్ స్టార్స్ సందడి

Jun 25 2026 9:27 PM | Updated on Jun 25 2026 9:51 PM

Tollywood celebrities at Baby Khushboo Sundar Daughter marriage

ప్రముఖ నటి ఖుష్బు సుందర్ ఇంట శుభకార్యం జరిగింది. ఆమె కూతురు పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినితారలు సందడి చేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా పాల్గొన్నారు. అంతేకాకుండా టాలీవుడ్ హీరోలు వెంకటేశ్, నాగార్జున కూడా హాజరయ్యారు. కోలీవుడ్ భామ త్రిష సైతం ఈ పెళ్లి వేడుకలో మెరిసింది. 

 కాగా.. ఖుష్బు సుందర్‌ తమిళంతో పాటు తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. చిరంజీవి హీరోగా వచ్చిన స్టాలిన్ చిత్రంలో ఖుష్బు సుందర్ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలో మెగాస్టార్‌కు అక్క పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె రాజకీయాలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement