అఖిల్ లెనిన్ కలెక్షన్స్.. మొదటి రోజు కంటే ఎక్కువే | Akkineni Akhil Lenin Movie Collections In Just Two Days | Sakshi
Sakshi News home page

Lenin Movie Collections: అఖిల్ లెనిన్.. రెండు రోజుల కలెక్షన్స్

Jul 12 2026 2:57 PM | Updated on Jul 12 2026 3:36 PM

Akkineni Akhil Lenin Movie Collections In Just Two Days

అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచో హిట్ కోసం తంటాలు పడుతోన్న అఖిల్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే లెనిన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటోంది.

ఈ మూవీకి తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డేనే రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లెనిన్‌కు పాజిటివ్ టాక్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. దీంతో రెండో రోజు ఆడియన్స్‌లో అదే జోరు కనిపించింది. ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.37.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు కంటే రెండో రోజే వసూళ్లలో పెరుగుదల కనిపించింది. వీకెండ్‌ కావడంతో మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది.

కాగా.. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement