breaking news
eknath
-
బుల్లితెర నటుడి పెంకుటిల్లు, పాక సింపుల్‌గా ఎంత బాగుందో!
బుల్లితెర నటుడు ఏక్‌నాధ్ సీరియల్స్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడీ యాక్టర్. నటి, భార్య హారికతో కలిసి ఫోటోషూట్లకు పోజులివ్వడమే కాకుండా అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతూ ఉంటాడు. ఇటీవలే ఏక్‌నాధ్ పుట్టినరోజున ఖరీదైన ఐఫోన్ గిఫ్టిచ్చింది హారిక. ఇదిలా ఉంటే తాజాగా ఏక్‌నాధ్ తను పుట్టి పెరిగిన ఇంటిని చూపించాడు. చిట్టూర్పులోని తన పెంకుటిల్లును చూపిస్తూ హోమ్‌టూర్ వీడియో చేశాడు. ఇందులో గేటు తీసుకుని లోపలికి వెళ్లగానే దారికిరువైపులా బోలెడన్ని మొక్కలు, చెట్లు, తులసివనం దర్శనమిచ్చాయి. ఇంట్లోకి వెళ్లడానికి ముందు పెద్ద వరండా ఉంది. తర్వాత హాల్, బెడ్రూమ్, కిచెన్ వరుసగా ఉన్నాయి. అన్ని గదులు విశాలంగా, గంభీరంగా ఉన్నాయి. వంట చేసుకోవడానికి ఇంటి వెనుక ప్రత్యేకంగా ఓ పాక కూడా ఉంది. ఇంటి వెనకాల కూడా అరటి, మామిడి, ఉసిరి, కొబ్బరి, దానిమ్మ, నిమ్మ, బాదం, సపోటా చెట్లతో పెద్ద తోట ఉంది. ఈ ఇంటిని చూసిన నెటిజన్లు 'పల్లెటూరి వాతావరణానికి తగ్గట్లు ఇల్లు ఎంత చక్కగా ఉందో, ఆ సామాను, ఇల్లు', 'మొక్కలు అవన్నీ చూస్తుంటే మేము గడిపిన పాతరోజులు గుర్తుకు వస్తున్నాయి', 'ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: హీరోయిన్ ముఖంపై సూదులు, అసలేమైంది? ఆ విషయం అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది: గీతూ -
బాంబుల ఏకనాథ్ ఇకలేరు
సినీ స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడు జి. ఏకనాథ్ (69) ఇక లేరు. ఐదు నెలలుగా కేన్సర్ వ్యాధితో పోరాడిన ఆయన బుధవారం ఉదయం చెన్నైలోని వలసరవాక్కం లక్ష్మీనగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్టణానికి చెందిన ఏకనాథ్ 55 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి సినీరంగంలో స్పెషల్ ఎఫెక్ట్స్ శాఖలో చేరారు. బాంబుల ఏకనాథ్‌గా పేరు పొందిన ఆయన 45 ఏళ్ల పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఏడువందలకు పైగా చిత్రాలకు పని చేశారు. ‘అల్లూరి సీతారామ రాజు, అగ్నిపర్వతం, జగన్మోహిని, తాండ్ర పాపారాయుడు, నాయకుడు’ వంటి ఎన్నో సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ చేశారు. సీనియర్ కెమెరామేన్ మోహనకృష్ణకు ఏకనాథ్ తమ్ముడు. దాసరి, కె.రాఘవేంద్రరావు, బాపయ్య, కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, తమిళంలో కె.బాలచందర్ వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఏకనాథ్ పనిచేశారు. కృష్ట, రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల చిత్రాలకు పనిచేశారు. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరిరాస్తా’కి ఏకనాథ్ పని చేశారు. ఈయనకు భార్య అన్నపూర్ణ, కొడుకు అనంత్‌నాగ్, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. గురువారం పోరూర్‌లోని శ్మశాన వాటికలో ఏకనాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్ కన్నుమూత
స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్ ఏక్నాథ్(70) అనారోగ్య కారణాలతో మృతిచెందారు. కంప్యూటర్స్ లేని కాలంలోనే కెమెరా టెక్నిక్ ద్వారా ఎన్నో వింతలను వెండితెర మీద పరిచయం చేసి ఏక్నాథ్ విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక, జానపద చిత్రాలకు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించటంలో ఆయన స్పెషలిస్ట్. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించిన ఏక్నాథ్ 55 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి సినీరంగంలో స్థిరపడ్డారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఎన్టీఆర్, కమల్ హాసన్ లాంటి ఎందరో అగ్రహీరోల చిత్రాలకు ఆయన విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. ముఖ్యంగా విఠలాచార్య సినిమాల్లో ఆయన వాడిన టెక్నిక్స్ మంచి పేరు తీసుకువచ్చాయి. కంప్యూటర్ యుగం మొదలైన తరువాత కూడా పలు త్రీడీ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా పనిచేశారు. -
రాష్ర్టవ్యాప్తంగా ఘనంగా ఉగాది
సాక్షి, ముంబై: నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుప్రజలు సోమవారం ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ప్రజలకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షల బోర్డులను ఏర్పాటుచేశాయి. ఖరాస్ బిల్డింగ్‌లో... ఖరాస్ బిల్డింగ్‌లో ‘ఓం పద్మశాలి సేవా సంఘం’ ఆధ్వర్యంలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ను సంస్థ అధ్యక్షుడు పోతు రాజారాం, ఉపాధ్యక్షుడు అంబల్ల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ, సిద్ధివినాయక మందిరం ట్రస్టీ సభ్యుడు ఏక్నాథ్ సంగం తదితరులు సత్కరించారు. అనంతర ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. కాగా ఓం పద్మశాలి విజయ సంఘం-(కమ్మర్పల్లి) ముంబై శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు గుడ్లనడిపి. లింబాద్రి, ప్రధాన కార్యదర్శి చింత రాంప్రసాద్, కోశాధికారి గుడ్ల రమేశ్, కార్యదర్శి చిలుక కిషన్, కమిటీ సభ్యులు వేముల నారాయణ, చిలివేరి నరేంద్ర, బొడ్డు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీఎస్ ఆధ్వర్యంలో... మోర్తాడ్ పద్మశాలి సంఘం (ఎంపీఎస్) ముంబై శాఖ ఆధ్వర్యంలో జయ నామ ఉగాది సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కామని హన్మాండ్లు, కార్యదర్శి అరుట్ల మల్లేశ్వర్, సలహాదారులు కామని బాబూరావు, యెల్ది సుదర్శన్, యెల్ది గణేశ్ తదితరులు పాల్గొన్నారు. చౌట్పల్లి గ్రామ సంఘం ఆధ్వర్యంలో చౌట్పల్లి గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం సంఘ సభ్యులు తీర్థప్రసాదాలతోపాటు పచ్చడిని కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బండి దామోదర్, ప్రధాన కార్యదర్శి కారంపూడి మనోహర్, కోశాధికారి అంబల్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు. టీపీఎస్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ పద్మశాలి సంఘం (టీపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చాట్ల గజానంద్, ప్రధాన కార్యదర్శి కట్కం రవీంద్ర, కోశాధికారి చాట్ల అశోక్ పాల్గొన్నారు. వర్లిలో... పద్మశాలి సమాజ సుధారక మండలి ఆధ్వర్యంలో ఉదయం ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజమల్లు పంతులు మార్కండేయ మహాముని విగ్రహానికి పూలమాల వేసి పూజ చేశారు. అనంతరం ప్రసాదం, పచ్చడిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సమాజ సుధారక మండలి అధ్యక్షుడు వాసాల శ్రీహరి, సాంస్కృతిక సమితి ప్రతినిధి అల్లె శంకరయ్య, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, సభ్యులు చింతకింది ఆనందం, జిందం భాస్కర్, సురేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీపీఎస్ ఆధ్వర్యంలో.... శ్రీ వేంపేట పద్మశాలి సంఘం (వీపీఎస్) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గాజంగి చక్రపాణి, కోశాధికారి జక్కని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా బీడీడీ చాల్ నంబరు 106లోని శ్రీరామ బాల సంఘం కార్యాలయంలోనూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు ఇట్టె మురళి, ఉపాధ్యక్షుడు తాటిపాముల గంగాధర్, ప్రధాన కార్యదర్శి సామల్ల శ్రీహరి, కోశాధికారి చింతకింది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభాదేవిలో.. ప్రభాదేవిలోని ఏర్గట్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వచ్చిన సభ్యులందరికీ పచ్చడిని పంపిణీ చేశామని అధ్యక్షుడు యెలిగేటి నడ్పి రాజారాం, ప్రధాన కార్యదర్శి దొంతుల హన్మాండ్లు, కోశాధికారి కంటం శ్రీధర్ లు చెప్పారు. ఉగాది పచ్చడి పంపిణీ ధారావిలోని మహారాష్ట్ర తెలంగాణ మంచ్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ లోక్‌సభ నియోజక వర్గం ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ను సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మచ్చ ప్రభాకర్, వాళేశ్వరం శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సంస్థ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుడుగుంట్ల వేంకటేశ్ గౌడ్, కార్యాధ్యక్షుడు కారింగు అంజయ్య, ప్రధాన కార్యదర్శి గొలుసుల లింగయ్య, కోశాధికారి ఆవుల రాములు, ఉపాధ్యక్షుడు జి.యాదగిరి, ప్రధాన కార్యదర్శి గొల్పుల లింగయ్య, కార్యదర్శి సాక శేఖర్, సహకోశాధికారి కన్నెబోయిన వెంకటేశ్, యూత్ అధ్యక్షుడు పురుగల కృష్ణ, యూత్ ఉపాధ్యక్షుడు ఎల్లంల సతీష్‌కుమార్, వేదిక నిర్వాహకులు పాక శంకర్, సరిగే సైదులు, నిర్వాహకులు బత్తుల శంకర్, బీసం వెంకన్న, బాసాని నర్సింహ, గుండబోయిన కృష్ణ ఎన్నుకున్నారు. ప్రతీక్షా నగర్లో... ప్రతీక్షానగర్ పద్మశాలి సమాజ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పచ్చడిని పంపిణీ చేశామని సంస్థ అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్, కార్యదర్శి అంజనేయులు చెప్పారు. తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో... గోరేగావ్‌లోని తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జయనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ సభ్యులతోపాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ ఉగాది పచ్చడి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వీరమల్ల మల్లేశ్, ఉపాధ్యక్షుడు వంటపాక శేఖ ర్, ఉపకార్యాధ్యక్షుడు స్వామి లెంకలపల్లి, కోశాధికారి బక్క అంజయ్య తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో... ఘాట్కోపర్ కామ్‌రాజ్‌నగర్‌లోని తెలుగు రహివాసి సేవా సంఘం (టీఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఉగాది నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానికులకు పచ్చడి పంపిణీ చేశామని ఆ సంస్థ అధ్యక్షుడు గుల్లే గంగాధర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జక్కుల తిరుపతి, గాలి మురళీధర్, చౌకి నారాయణ తదితరులు పాల్గొన్నారు. టీపీఎస్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా పశ్చిమ గోరేగావ్‌లో తెలంగాణ ప్రజాసంఘం (టీపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం అందరికీ షడ్రుచుల పచ్చడిని పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజాసంఘం కార్యాధ్యక్షుడు బక్క అంజయ్య ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసంఘం అధ్యక్షుడు వీరమల్ల మల్లేష్, కోశాధికారి పరమేశ్ భీమగోని, ఉపాధ్యక్షుడు శేఖర్ వంటపాక, నర్సిరెడ్డి మన్నె, ఉపకార్యాధ్యక్షుడు స్వామి లెంకలపల్లి, నర్సింహ బీనా మోని, శంకర్ బద్దం, గణేశ్. మచ్చ, సుక్క. అంజయ్య, కురుపీటి. కృష్ణ, మల్లేశ్. గాదె, లక్ష్మణ్, ఎర్ర, జానీ, నాయక్ తదితరులు పాల్గొన్నారు.