ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. మరోవైపు సమంత సీమంతం | Actress Samantha Baby Shower Latest Pics And Details | Sakshi
Sakshi News home page

Samantha: చిత్తూరులో సింపుల్‌గా సమంత సీమంతం వేడుక!

Jul 17 2026 11:30 AM | Updated on Jul 17 2026 11:55 AM

Actress Samantha Baby Shower Latest Pics And Details

గతేడాది డిసెంబరులో దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న సమంత.. గత నెలలో 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చింది. రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించి.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇకపోతే ఇప్పడీ మూవీ హాట్‌స్టార్ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అదే టైంలో సమంత సీమంతం కూడా జరిగినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

'మా ఇంటి బంగారం' రిలీజ్ తర్వాత బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. తర్వాత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఖరారు చేసింది. రీసెంట్‌గానే భర్తతో కలిసి థాయ్‌లాండ్ ట్రిప్ వేసింది. ఆ తర్వాత చిత్తూరులోని ఓ శుభకార్యం కోసం అత్తగారింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఈమెకు సింపుల్‌గా సీమంతం చేశారు. ఆ ఫొటోలని రాజ్ సోదరి శీతల్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేయగా అవి కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సమంత ఈ ఏడాది డిసెంబరులో బిడ్డకు జన్మనిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆరేడు నెలలు విశ్రాంతి తీసుకుని కొత్త సినిమాలు మొదలుపెట్టే అవకాశముంది.

(ఇదీ చదవండి: 'ది ఒడిస్సీ' సినిమా ‍ట్విటర్ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement