నాగచైతన్య, సమంత, అఖిల్.. నెక్స్ట్ ఎవరు? | Wedding Before A Blockbuster? Tollywood's Latest Marriage Success Trend Explained, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Akhil Lenin: పెళ్లి 'భలే' కలిసొస్తోంది.. ఆ ముగ్గురే ఇంకా బ్యాలెన్స్

Jul 14 2026 11:42 AM | Updated on Jul 14 2026 12:46 PM

After Wedding Tollywood Actors Success Their Movies Latest Ex Lenin

సాంకేతికంగా ప్రపంచం ఎంతలా అభివృద్ధి చెందినా సరే కొన్ని నమ్మకాలు, సెంటిమెంట్స్ అలా ఉండిపోతాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాటిని ఎక్కువగా నమ్ముతారు, పాటిస్తారు. రీసెంట్ టైంలో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పెళ్లి చేసుకున్న వెంటనే పలువురు సెలబ్రిటీలు గుర్తుండిపోయే హిట్స్ కొట్టేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్)

కిరణ్ అబ్బవరం హీరోగా చాలా సినిమాలు చేశాడు గానీ తొలి మూవీ తప్పితే మిగిలినవి ఏవీ సక్సెస్ కాలేదు. అలాంటి టైంలో అంటే 2024లో తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇది జరిగిన కొన్నాళ్లకే 'క' మూవీతో వచ్చాడు. అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు.

గతేడాది ఫిబ్రవరిలో నాగచైతన్య 'తండేల్'తో వచ్చాడు. అంతకు సరిగ్గా రెండు నెలల ముందే శోభితని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయింది. చైతూ 'తండేల్'తో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. ప్రస్తుతం 'వృషకర్మ' మూవీ చేస్తున్నాడు. దీనిపై బజ్ బాగానే ఉంది.

గతేడాది డిసెంబరులో సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. 'ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కట్ చేస్తే లాంగ్ గ్యాప్ తర్వాత 'మా ఇంటి బంగారం' మూవీతో సామ్ రీఎంట్రీ ఇచ్చింది. విడుదలకు ముందు దీనిపై పెద్దగా బజ్ లేదు. కానీ ఊహించని విధంగా మూవీ హిట్ కావడంతో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ కూడా వచ్చాయి. ‍ప్రస్తుతం సమంత ప్రెగ్నెన్సీతోనూ ఉంది. అది ఇంకో గుడ్ న్యూస్.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)

గతేడాది జూన్‌లో అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు జైనబ్ మెడలో మూడుముళ్లు వేశాడు. సరిగా ఏడాది తిరిగేసరికల్లా ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న హిట్ 'లెనిన్' రూపంలో దక్కింది. ప్రస్తుతం అఖిల్ ఫుల్ హ్యాపీ. ఇదే ఊపులో జాగ్రత్తగా మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాడు. ఇలా వరసగా నలుగురు స్టార్స్ అలా పెళ్లిచేసుకున్నారో లేదో ఇలా కెరీర్‌లోనే గుర్తుండిపోయే సక్సెస్‌ని అందుకున్నారు.

ఈ లిస్టులో ఇంకా ముగ్గురు మిగిలున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి చేసుకున్నారు. రష్మికకు ఎలానూ హిట్స్ ఉన్నాయి కానీ విజయ్‌కే కెరీర్ ప్రారంభంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' తప్పితే చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు శిరీష్ కూడా రీసెంట్ టైంలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతానికైతే వీళ్లు ముగ్గురు మాత్రమే వివాహం చేసుకుని హిట్ విషయంలో పెండింగ్‌లో ఉన్నారు. ఒకవేళ వీళ్లు కూడా సక్సెస్ అందుకుంటే 'పెళ్లి' సెంటిమెంట్, టాలీవుడ్‌లో మరింత పాపులర్ అయిపోవడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: జైలులోనే స్టార్ హీరో.. ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement