కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్ | Shruti Haasan Performs Housewarming Ceremony At Her New Chennai House, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Shruthi Haasan: ముంబైలో ఆల్రెడీ ఉంది.. ఇప్పుడు చెన్నైలోనూ

Jul 14 2026 9:57 AM | Updated on Jul 14 2026 11:07 AM

Shruthi Haasan New House Warming Ceremony Chennai

స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ శుభవార్త చెప్పేసింది. చెన్నైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం ఉదయం సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుక నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లోనూ శ్రుతి హాసన్ పాల్గొంది. ఈ క్రమంలోనే అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)

గతేడాది బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్.. ముంబైలోని శ్రుతి హాసన్ ఇంటికి వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోని ఫరా.. తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. ఆ ఇంటిని శ్రుతి హాసన్ తన అభిరుచులకు అనుగణంగా డెకరేట్ చేసుకుంది. ఇప్పుడు చెన్నైలోని ఇంటిని కొనుగోలు/కట్టించుకుని మరోసారి తన సొంతిటి కల నెరవేర్చుకుంది.

శ్రుతి హాసన్ కెరీర్ విషయానికొస్తే గతేడాది 'కూలీ'లో నటించింది. రీసెంట్‌గా వచ్చిన 'పెద్ది'లో ఐటమ్ సాంగ్ చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న తెలుగు మూవీ 'ఆకాశంలో ఒక తార', విజయ్ సేతుపతి 'ట్రైన్' చిత్రాల్లో శ్రుతి హీరోయిన్‌గా చేస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement