దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ మూవీ రిలీజ్ కాలేదు. తాజాగా ఇటీవల సెన్సార్ బోర్డ్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 24న జన నాయగన్ విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇటీవల ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. అప్పుడే రికార్డ్స్ సృష్టిస్తోంది. ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో యూకేలో అప్పుడే రూ.కోటికి పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని ఏషియన్ బాక్స్ ఆఫీస్ సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాకుండా యూకేలో జన నాయగన్ అన్‌కట్ వెర్షన్ విడుదల చేయనున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. మరి కొన్ని దేశాల్లోనూ అన్‌కట్ వెర్షన్‌ను ప్రదర్శించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
కాగా.. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు.


