తమిళనాట 'వాటర్‌మెలన్' స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దివాకర్ వివాదంలో చిక్కుకున్నాడు. గతేడాది జరిగిన తమిళ బిగ్‌బాస్ 9వ సీజన్‌లోనూ పాల్గొన్న ఇతడు.. రీసెంట్ టైంలో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)
తన వీడియోల ద్వారా యూట్యూబ్ ఛానెల్‌కి చాలా ఆదాయం వస్తున్నందున, రూ.లక్ష డిమాండ్ చేస్తూ దివాకర్ బెదిరించాడనే ఆరోపణలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూ సంధర్భంగా జరిగిన గొడవలో దివాకర్.. ఖరీదైన కెమెరాని పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. కంపెనీ తరఫున సంబంధిత ఆధారాలతో కిల్పాక్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీని ఆధారంగా పోలీసులు, దివాకర్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
మరోవైపు యూట్యూబ్ ఛానెల్ ఉద్యోగులు తనని అక్రమంగా ఓ గదిలో బంధించి, దాడి చేశారని చెబుతూ వీడియోలని సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతూ దివాకర్ ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఇందులో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దివాకర్ కోరాడు. ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దివాకర్ తన వీడియోలో పేర్కొన్నాడు. ఆ విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది.
(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో హీరో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)


