నేనేం చేస్తున్నానో నాకు తెలుసు: నాగ్ అశ్విన్ | Nag Ashwin Reacts To Criticism On Kalki Movie Karna Character Issue, Asks Fans To Read The Mahabharata, Post Viral On Social Media | Sakshi
Sakshi News home page

Nag Ashwin: 'కర్ణుడి' పాత్రపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్

Jul 13 2026 9:59 AM | Updated on Jul 13 2026 11:26 AM

Nag Ashwin Reacts Kalki Movie Karna Character Issue Latest

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'కల్కి 2898ఏడీ' సీక్వెల్ ఒకటి. రెండేళ్ల క్రితం వచ్చిన తొలి భాగం ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చివరలో కర్ణుడి పాత్రని చూపించిన విధానంపై కొందరు దర్శకుడు నాగ్ అశ్విన్‌ని విమర్శించారు. ఇప్పటికీ అది ఆగట్లేదు. తాజాగా ఓ నెటిజన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేయగా దర్శకుడు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఇప్పుడు వాళ్ల కళ్లు చల్లబడ్డాయి.. జానకి మరణంపై సుశీల)

'మహాభారతంలోని ద్రోణ వధ పర్వానికి సంబంధించిన ఓ పేజీ స్క్రీన్ షాట్ షేర్ చేసిన నాగ్ అశ్విన్.. యుద్ధభూమిలో అర్జునుడితో శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుడి గొప్పతనాన్ని, పరాక్రమాన్ని ప్రస్తావించాడు. నన్ను విమర్శించే ముందు మహాభారతాన్ని పూర్తిగా చదవండి లేదా కనీసం శ్రీకృష్ణుడు, కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడో తెలుసుకోండి. భారతీయ ఇతిహాసాలు, పురాణాలపై నాకు అపారమైన గౌరవం ఉంది. వాటన్నింటికీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పూర్తి అవగాహనతో సినిమా తీశాను. ఓ దర్శకుడిగా నేను ఏం చేస్తున్నానో నాకు పూర్తిగా తెలుసు, కల్కి పార్ట్ 2 కోసం వేచి చూడండి' అని నాగ్ అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు.

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె తదితరులు తొలి భాగంలో నటించారు. కానీ సీక్వెల్‌కి వచ్చేసరికి దీపిక తప్పుకొంది. ఈ విషయాన్ని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దీంతో ఈమె స్థానంలో ఆలియా భట్‌ని తీసుకున్నారనే రూమర్స్ వస్తున్నాయి. ప్రభాస్ లైనప్ బట్టి చూస్తే ఈ ఏడాది చివరలో 'ఫౌజీ', వచ్చే ఏడాది మార్చిలో 'స్పిరిట్' రిలీజ్ అవుతాయి. ఆ లెక్కన చూసుకుంటే 'కల్కి' సీక్వెల్ వచ్చేసరికి 2028 అయిపోవచ్చు.

(ఇదీ చదవండి: ఇది నా నిజ జీవిత పాత్రలానే ఉంది: రోజా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement