హైదరాబాద్, సాక్షి: అక్రమంగా అరెస్ట్ చేసిన వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు బేగం బజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో యర్రగొండపాలెం ఎంఎల్‌ఏ తాటిపర్తి చంద్రశేఖర్ బేగం బజార్ పీఎస్ వద్దకు చేరుకుని నాగార్జున యాదవ్ అరెస్ట్‌ను ఖండించారు. 41(ఎ) నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. నాగార్జున యాదవ్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు.
అలాగే నాగార్జున యాదవ్ అరెస్ట్‌ను మాజీ మంత్రి జోగి రమేష్ ఖండించారు. చంద్రబాబు బీసీలను వేధిస్తున్నారని, చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితోనే అక్రమ అరెస్ట్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలను అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారన్నారు.


