వాళ్లకి నా సమాధానం ఇదే: ప్రకాశ్‌రాజ్‌ | Prakash Raj answer to those who are spreading fake stories | Sakshi
Sakshi News home page

వాళ్లకి నా సమాధానం ఇదే: ప్రకాశ్‌రాజ్‌

Jul 12 2026 2:52 PM | Updated on Jul 12 2026 3:32 PM

Prakash Raj answer to those who are spreading fake stories

ప్రశ్నించే గొంతులమీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లకి తన సమాధానం ఇదేనంటూ సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ మరో ట్వీట్‌ చేశారు. వీడియో రూపంలో మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతును ఆపలేరని చెప్పారు.

‘‘మౌనంగా లేను.. అన్నీ చూస్తున్నాను.. అమ్ముడుపోయిన ఛానల్స్‌ కట్టుకథలు, అబద్ధాలు వింటున్నాను. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. ప్రపంచమంతా మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. దిగజారడంలో మీకు మీరే సాటి అని గర్వంతో దిగజారకండి. మీరు ఎంత అరిచినా ప్రశ్నంచే గొంతును ఆపలేరు’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. 

ప్రకాశ్‌రాజ్ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుగా మారి ఎన్నో అంశాలపై స్పందిస‍్తున్నారు. సమాజంలో జరుగుతున్న అంశాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. దేశ రాజకీయాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాలపై ఆయన తరచూ స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం, మీడియా, పౌర సమాజం అందరూ జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆయన పలుసార్లు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement