మలయాళ డబ్బింగ్ సినిమాలతో బోలెడంత ఫేమ్ తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్.. 'పుష్ప'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇతడి పాత్రని చూపించిన విధానంపై విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో తెలుగు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోయాడు. అదే 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'. సెప్టెంబరు 11న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అలానే టీజర్ వదిలారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)
టీజర్ బట్టి చూస్తే హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. మ్యాజిక్స్ చేసే హీరో(ఫహాద్ ఫాజిల్) ఓ పాపతో స్నేహం చేస్తాడు. తన విద్యలని ఆ పాపకు నేర్పిస్తాడు. అయితే పాపకు వచ్చిన సూపర్ పవర్స్ కారణంగా హీరో ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. దీన్ని రాజమౌళి సమర్పిస్తుండగా.. 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి కొడుకు కార్తికేయ కలిసి నిర్మిస్తున్నారు.
(ఇదీ చదవండి: ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం)


