20 ఏళ్ల తర్వాత తమన్ ఎంట్రీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది | Atharvaa Starrer Hrudhayam Murali Official Trailer out now | Sakshi
Sakshi News home page

Hrudhayam Murali Official Trailer: 20 ఏళ్ల తర్వాత తమన్ ఎంట్రీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది

Jul 7 2026 9:27 PM | Updated on Jul 7 2026 9:28 PM

Atharvaa Starrer Hrudhayam Murali Official Trailer out now

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ నటుడిగా వస్తోన్న చిత్రం హృదయం మురళి. ఆకాశ్‌ భాస్కరన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్ఎస్ తమన్ కీలక పాత్ర పోషించారు. తమిళంలో ఇదయం మురళి పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో హృదయం మురళిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ సీన్స్‌ చూస్తుంటే యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌ కథగా కనిపిస్తోంది. ఈ మూవీకి తమనే సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. 20 ఏళ్ల క్రితం శంకర్‌ దర్శకత్వం వహించిన బాయ్స్‌ చిత్రంలో తమన్‌ నటించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement