కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్. ఈ మూవీకి హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను వైశాక్ జె ఫిల్మ్స్ బ్యానర్‌పై డా. వైశాక్ జె గౌడ నిర్మించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. నాన్న ప్రతి కథకు ఏం కావాలని చెప్పారు? ఒక హీరో కావాలని అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్ చూస్తుంటే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గానే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలీ పుష్ప ఫేమ్ డాలీ ధనంజయ, అదితి బాలన్, యష్ శెట్టి, అశోక్ శర్మ, కుశాల్ బికె, తక్ష వర్ధన్, అరవింద్, వరుణ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతమందించారు.


