రావణుడి పాత్ర అందుకే చేస్తున్నా: యశ్‌ | Yash on playing Ravana in Ramayana | Sakshi
Sakshi News home page

రావణుడి పాత్ర అందుకే చేస్తున్నా: యశ్‌

Aug 18 2026 12:24 AM | Updated on Aug 18 2026 12:24 AM

Yash on playing Ravana in Ramayana

‘‘శ్రీరాముడి గొప్పతనం, మంచితనం చె΄్పాలంటే రావణుడి పాత్ర కూడా అంతే బలంగా ఉండాలి. అందుకే ‘రామాయణ’ సినిమాలో రావణుడి పాత్రకు నేను అయితేనే న్యాయం చేయగలననే నమ్మకం కూడా కలిగింది. అందుకే రావణుడి పాత్రని నేను చేస్తున్నాను’’ అని యశ్‌ తెలిపారు. ఆయన  హీరోగా నటించిన తాజా పాన్‌ ఇండియా మూవీ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో మాన్  స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్ , కేవీఎన్‌ ప్రోడక్షన్స్ పై నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆప్‌ కీ అదాలత్‌’ అనే  టాక్‌ షోలో పాల్గొన్నారు యశ్‌.

ఈ సందర్భంగా హోస్ట్‌ రజత్‌ శర్మ నుంచి ఆయనకి ఓ ప్రశ్న ఎదురైంది. ‘రామాయణ’ సినిమాకు మీరు సహ నిర్మాతగా ఉన్నారు. అలాంటప్పుడు మీరు రాముడి పాత్ర కాకుండా రావణుడి పాత్రను ఎందుకు ఎంపిక చేసుకున్నారు?’ అన్నారు. ఇందుకు యశ్‌ బదులిస్తూ–‘‘మంచి పాత్రలు చేసేందుకు నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ‘రామాయణ’ ప్రాజెక్ట్‌ను ఏ నటుడి స్టార్‌డమ్‌ కోసమో చేయట్లేదు.

ఆహం పక్కన పెట్టేసి యూనిట్‌ అంతా కష్టపడి పని చేస్తున్నాం’’ అన్నారు. అదేవిధంగా పాన్‌ ఇండియా స్టార్‌డమ్‌ గురించి ఎదురైన మరో ప్రశ్నకు యశ్‌ స్పందిస్తూ–‘‘స్టార్‌డమ్‌ అన్నది ఎవరికీ శాశ్వతం కాదు. ఇండస్ట్రీలో పరిస్థితులు, తలరాతలు మారి΄ోవడానికి ఒక్క శుక్రవారం చాలు. ప్రేక్షకులు ఇచ్చే తీర్పే హీరో స్టార్‌డమ్‌ను నిర్ణయిస్తుంది’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement