రాజమౌళికి అరుదైన గౌరవం.. దర్శకధీరుడు ఎమోషనల్ | SS Rajamouli Shares His Feeling after his Name at Lumiere Museum | Sakshi
Sakshi News home page

SS Rajamouli: దిగ్గజాల సరసన రాజమౌళి పేరు.. ఎమోషనల్ ట్వీట్

Jul 2 2026 4:33 PM | Updated on Jul 2 2026 4:39 PM

SS Rajamouli Shares His Feeling after his Name at Lumiere Museum

దర్శకధీరుడు రాజమౌళి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఫ్రాన్స్‌ లియాన్‌లోని ప్రతిష్టాత్మక లూమియర్ మ్యూజియంలోని దిగ్గజాల సరసన నిలిచారు. ఫ్రాన్స్ సినీ దిగ్గజాలతో పాటు మన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేరును శాశ్వతంగా మ్యూజియంలో ముద్రించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. తన జీవితాంతం గుర్తుండిపోయే ఈ జ్ఞాపకాన్ని అందించినందుకు ధన్వవాదాలు తెలిపారు.

కాగా.. ఫ్రాన్స్‌లోని లియాన్‌లో ఉన్న లూమియర్ మ్యూజియంలో గతంలో 'ఈగ', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్ చేసిన రూమ్‌ను రాజమౌళి సందర్శించారు. ఈ సందర్భంగా లూమియర్  ఇన్‌స్టిట్యూట్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమాక్స్ రాజమౌళికి సర్‌ప్రైజ్ ఇస్తూ ఆయన పేరు ముద్రించిన శిలాఫలకాన్ని అందించారు. ఈ ప్రకటనతో తాను భావోద్వేగానికి లోనయ్యానని రాజమౌళి రాసుకొచ్చారు. అక్కడ ఫలకాలతో నిండిన ఒక గోడకు మార్టిన్ స్కోర్సెస్, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరాంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా వంటి దిగ్గజాల పేర్లు... వాటిని ఎర్రటి వస్త్రంతో కప్పబడిన ఒక ప్లేట్‌ను గమనించానని దర్శకధీరుడు ట్వీట్‌ చేశారు. అక్కడ నా పేరు చూసి మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయిందని రాజమౌళి పోస్ట్ చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement