తిరుమల : ప్రముఖ సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.


