తెలుగు తెరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శక నిర్మాత పి.ఎన్. రామచంద్రరావు కొంత విరామం తర్వాత రూపొందించిన పాన్ ఇండియా సినిమా "పహల్గాం లవ్ స్టోరీ".
ఈ సినిమాను గాయత్రి కళా చిత్ర బ్యానర్ పై పి.ఎన్. రామచంద్రరావు నిర్మించి దర్శకత్వం వహించారు.
ఇంటెన్స్ పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణ మోహన్, చిత్రశుక్ల హీరో హీరోయిన్స్ గా నటించారు.
సుమన్, పూజా బిస్త్, జయప్రకాష్ నారాయణ ఇతర కీలక పాత్రలు పోషించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.


