అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ హీరో దర్శన్.. ఎప్పుడు బయటకొస్తాడనేది తెలియదు. మరోవైపు ఈ హడావుడి జరుగుతున్న టైంలోనే ఇతడు హీరోగా నటించిన ఓ మూవీ రిలీజైంది. కానీ యావరేజ్‌గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుందంటే?
(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్)
దర్శన్, రచనా రాయ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'ద డెవిల్'. గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. ఆ టైంలోనే దర్శన్ జైలులో ఉండటంతో అభిమానులు ఈ మూవీకి వెళ్లారు. అయితే నెలనెలన్నరకే ఓటీటీలోకి వచ్చేస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ నెలలు గడిచిపోతున్న స్ట్రీమింగ్ డేట్ ప్రకటించలేదు. అలాంటిది ఇప్పుడు దాదాపు ఏడు నెలల తర్వాత ఈ శుక్రవారం(జూలై 17) నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా వీడియో రిలీజ్ చేశారు. అయితే కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది.
'ద డెవిల్' విషయానికొస్తే.. రాజశేఖర్ అనే ముఖ్యమంత్రి ఓ నేరం కారణంగా జైలుపాలవుతాడు. అతడి కొడుకు ధనుష్, లండన్‌లో ఉంటాడు. అతడిని తీసుకురమ్మని రాజశేఖర్, ఓ ఐఏఎస్‌కి బాధ్యత అప్పగిస్తాడు. కానీ ధనుష్ రానంటాడు. దీంతో ఒకే పోలికలతో ఉన్న కృష్ణ అనే వ్యక్తిని.. ధనుష్‌లా మారుస్తారు. కట్ చేస్తే డెవిల్ తిరిగొస్తాడు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)
ನಿಯಮಗಳನ್ನ ಬರೆದವನಲ್ಲ ಮುರಿದವನು - 'ದಿ ಡೆವಿಲ್'.
ಜುಲೈ 17ರಿಂದ ಕನ್ನಡ Zee 5ನಲ್ಲಿ.#darshanthoogudeepasrinivas #dboss #thedevil #kannadazee5 #thedevilonzee5 pic.twitter.com/cAA1MDSS5L— ZEE5 Kannada (@ZEE5Kannada) July 11, 2026


