తిరుమల: అక్టోబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాలు, గదుల కోటాల వివరాలను టీటీడీ ఆదివారం విడుదల చేసింది. ఇందులో తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కోటాను జూలై 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎల్రక్టానిక్ డిప్ కోసం 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు, 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా 23న ఉచిత ప్రత్యేక దర్శన కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల చేస్తుంది.


