బలవంతపు భూసేకరణపై రైతుల ఆగ్రహం
తాడేపల్లి రూరల్: తగిన నష్టపరిహారం ఇస్తే రాజధాని నిర్మాణానికి భూములిస్తామని చెప్పిన ఉండవల్లి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు జొన్న శివశంకరరావు, రైతు బుర్రముక్కు పద్మారెడ్డి, రాజధాని రైతు సంఘం కార్యదర్శి కె.ఈశ్వర్‌రెడ్డి, డి.వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఉండవల్లిలోని రైస్‌మిల్లు వద్ద బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకిచ్చి న రిటర్నబుల్ ప్లాట్‌లో ఎఫ్‌ఎస్‌ఐ కన్‌స్ట్రక్షన్ 4 శాతం (సుమారు ఎనిమిది ఫ్లోర్లు) పరి్మషన్ ఇస్తామని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు.
భూములిచ్చి న 6 నెలల్లోపు ప్లాట్లలో కరెంటు, వాటర్, మోడల్ ప్లాటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ చెప్పిన మాటలు ఆచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు ఇచ్చి న హామీలు నెరవేర్చకుండా రాత్రికి రాత్రే పంటలను నాశనం చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఉండవల్లి స్టీరింగ్ కమిటీ సభ్యులు నాగరాజు, కోటేశ్వరరావు, శ్రీధర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దున్నేసిన భూములను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు
ఉండవల్లి పరిసర ప్రాంతాల్లోని భూములను రైతుల నుంచి ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కోవడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ నేత మున్నంగి వెంకటశ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. ఉండవల్లిలో సీఆర్‌డీఏ అధికారులు దున్నేసిన భూములను వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతలతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు.


