వెంచర్‌ వేస్తే వాలిపోతున్న టీడీపీ గద్దలు | Police arrest venture owner in Kurichedu mandal | Sakshi
Sakshi News home page

వెంచర్‌ వేస్తే వాలిపోతున్న టీడీపీ గద్దలు

Jul 13 2026 3:35 AM | Updated on Jul 13 2026 3:35 AM

Police arrest venture owner in Kurichedu mandal

గేటుకు తాళం వేసిన పోలీసులు

లేఅవుట్‌దారుల నుంచి ముడుపులు వసూలుచేస్తున్న టీడీపీ దర్శి ఇన్‌చార్జ్‌ 

పోలీసుల అండతో అరాచకాలు 

తాజాగా కురిచేడు మండలంలో వెంచర్‌ యజమానిని నిర్బంధించిన పోలీసులు  

కొనుగోలుదారులు వచ్చిన బస్సును వెంచర్‌లోనే ఉంచి గేట్లకు తాళాలు 

బస్సులో విజయవాడ, రాజమహేంద్రవరం నుంచి వచ్చిన 40 మంది కొనుగోలుదారులు 

ఇతర వాహనాలు మాట్లాడుకుని వెళ్లిపోవాలని వారికి పోలీసుల ఉచిత సలహా 

దీంతో గంటల తరబడి పిల్లలతో వారు చీకట్లో భయాందోళనలకు గురైన వైనం 

చర్చనీయాంశంగా మారిన ప్రకాశం జిల్లా దర్శి సీఐ రామారావు అత్యుత్సాహం 

సాక్షి టాస్క్ ఫోర్స్: ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గంలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ విషయంలో పోలీసుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గొట్టిపాటి లక్ష్మి ప్రోద్భలంతో దర్శి సీఐ రామారావు జోక్యం చేసుకుని, వెంచ­ర్‌ యజమానిని గంటల తరబడి పోలీస్‌స్టేషన్‌లో ని­ర్బం­ధించడమే కాకుండా కొనుగోలుదారులతో వచ్చిన బస్సును వెంచర్‌ లోపలే నిలిపివేసి గేట్లకు తాళాలు వేయించారు.  దీంతో విజయవాడ, రాజమహేంద్రవ­రం నుంచి వచ్చిన సుమారు 40 మంది కొనుగోలుదారు­లు, వారి కుటుంబ సభ్యులు చిన్నారులతో సహా చీ­కట్లో గంటల తరబడి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 

ఈ వ్యవహారం వెనుక రాజకీయ ఒత్తిళ్లు, ముడుపుల వ్య­వహారం ఉన్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపి­స్తు­న్నా­యి. కురిచేడు మండలం మల్లాయపాలెం రె­వెన్యూ విలేజ్‌ పరిధిలో ఆదివారం రాత్రి ఒక వెంచర్‌ యజ­మానిని పోలీసులు నిర్బంధించారు. ఈ ఘటన­కు సంబంధించి తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ సుమారు 10 ఎకరాల్లో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి హౌస్‌ ప్లాట్లకు వెంచర్‌ వేశాడు.  కొందరు ఏజెంట్లతో కలిసి ఆదివారం విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతా­ల నుంచి వెంచర్‌ను చూపించేందుకు టూరిస్టు బస్సు­లో కొనుగోలుదారులను తీసుకొచ్చాడు. 

                                 చీకట్లో రోడ్డుపై వేచి ఉన్న కొనుగోలుదారులు   

ప్లాట్లు చూసి వాళ్లు  వెంచర్‌ యజమానితో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వెంచర్‌ యజమానిని తీసుకెళ్లి దర్శి సీఐ కార్యాలయంలో నిర్బంధించారు. వచ్చిన కొనుగోలుదారులను, ఏజెంట్లు దాదాపు 40 మందిని వెంచర్‌ బయ­టకు పంపించేసి బస్సును వెంచర్‌ లోపల పెట్టి గేటుకు తాళం వేశారు. ఇతర వాహనాలు మాట్లాడుకుని మీదారి­న మీరు వెళ్లండని ఉచిత సలహాసైతం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘కురిచేడు వరకు పంపండి, మహిళలు, చిన్నపిల్లలున్నారు’అని బతిమాలినా పట్టిం­^­è ుకోలేదు. తమను తీసుకొచ్చిన ఏజెంట్లతోసహా రాత్రి పొద్దు­పోయే వరకూ గంటల తరబడి పిల్లలతో వెంచర్‌ వద్ద చీకట్లో నిలబడి భయాందోళనలకు గురయ్యారు.   

టీడీపీ నేత ‘తానా’.. పోలీసుల ‘తందానా..!’ 
నియోజకవర్గంలో ఎక్కడ వెంచర్‌ వేసినా తనకు కప్పం చెల్లించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి ఆయా వెంచర్‌ల యజమానులపై ఒత్తిడి తెస్తున్నట్లు నియోజకవర్గంలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఆదేశాల మేరకు సీఐ రామారావు వెంచర్‌ యజమానిని భయభ్రాంతులకు గురిచేస్తూ, ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

పొద్దుపోయే వరకూ వెంచర్‌ యజమానిని సీఐ కార్యాలయంలోనే ఉంచినట్లు తెలిసింది. ఎక్కడ వెంచర్లు వేసినా పోలీసులను అడ్డుపెట్టుకుని వసూళ్లు చేయటం గొట్టిపాటి లక్ష్మికి సర్వసాధారణమైపోయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పోలీసులు కూడా ప్రజల కోసం పనిచేయటం మానుకుని టీడీపీ ఇన్‌చార్జ్‌కి  వసూలు పనిలో ఉంటున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement