డిజిటల్ వినోదాన్ని మరింత అందుబాటులోకి.. సరసమైన ధరలోకి తీసుకురావాలనే తన నిబద్ధతను కొనసాగిస్తూ, జియో 'జియోహోమ్ టీవీ ప్యాక్' ఆవిష్కరించింది. నెలకు కేవలం రూ.400 నుంచే ప్రారంభమయ్యే ఈ సమగ్ర హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు, ప్రీమియం ఓటీటీ యాప్‌లు, హై-స్పీడ్ వై-ఫై సేవలు ఒకే ప్లాన్‌లో అందుబాటులో ఉంటాయి.
ఇంటి వినోదాన్ని మరింత సులభతరం చేయడానికి రూపొందించిన జియోహోమ్ టీవీ ప్యాక్ ద్వారా, వినియోగదారులు నెలకు రూ.400 (అన్ని పన్నులతో కలిపి) చెల్లించి 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. కుటుంబ సభ్యులందరికీ సమగ్ర టెలివిజన్ వినోదాన్ని సరసమైన ధరలో అందించే పరిష్కారంగా ఈ ప్యాక్ నిలుస్తుంది.
పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే వెల్‌కమ్ ఆఫర్లో భాగంగా, జియోహోమ్ టీవీ ప్యాక్‌కు సబ్‌స్క్రైబ్ అయ్యే వినియోగదారులు మొదటి నెలకు 30 Mbps వేగంతో అపరిమిత ఫ్రీ వై-ఫైతో పాటు 12 ప్రీమియం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా పొందవచ్చు.

ఈ ప్యాక్‌ను రూ.2,400 (GSTతో కలిపి) విలువైన ఫస్ట్ రీఛార్జ్ (FRC) ద్వారా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌కు వర్తిస్తుంది. అంటే నెలకు కేవలం రూ.400 మాత్రమే ఖర్చవుతుంది. ఒకేసారి చెల్లించే ఈ మొత్తంతో ఎలాంటి దాచిన చార్జీలు లేకుండా పారదర్శకమైన ధరల ప్రయోజనం వినియోగదారులకు లభిస్తుంది.
వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు.. జీరో జియోఇన్‌స్టాలేషన్ ఛార్జీ, సెక్యూరిటీ డిపాజిట్తో ఈ సేవను అందిస్తోంది. దీంతో ఎలాంటి ముందస్తు ఆర్థిక భారం లేకుండా ప్రీమియం హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించవచ్చు.
జియోహోమ్ టీవీ ప్యాక్‌తో, లైవ్ టీవీ, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, ప్రీమియం ఓటీటీ కంటెంట్‌ను ఒకే సరసమైన ప్యాక్‌లో అందిస్తూ, కనెక్టెడ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు జియో కొత్త నిర్వచనం ఇస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సులభమైన, విలువ ఆధారిత డిజిటల్ సేవలను అందించాలనే జియో లక్ష్యానికి ఈ కొత్త ఆఫర్ మరో నిదర్శనం.


