ఇరాన్‌తో యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. బంగారం ధరలు మరోసారి ఒత్తిడికి గురవుతున్నాయి. సాధారణంగా ప్రపంచంలో యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిన సమయంన్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం ధరలు పెరగడం సహజం. కానీ.. ప్రస్తుతం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. యుద్ధం తీవ్రతరం అవుతున్నప్పటికీ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
మార్కెట్‌లోని చాలామంది ట్రేడర్లు యుద్ధం జరిగితే.. బంగారం ధరలు పెరగవని, పైగా తగ్గుతాయని భావించే పరిస్థితికి అలవాటు పడుతున్నారు. ఈ అభిప్రాయంతో కొందరు ట్రేడర్లు బంగారం ధరలు మరింత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. బహుశా ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగకపోవచ్చని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు పీటర్ డేవిడ్ షిఫ్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చినట్లయితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో పెట్టుబడిదారులు మళ్లీ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు పెరుగుతాయి.
ప్రస్తుతం కనిపిస్తున్న ధరల పతనం తాత్కాలికమే కావచ్చు, త్వరలోనే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Once again, gold is selling off as the war with Iran escalates. Traders are being conditioned to believe that war is now bearish for gold. Shorts will be in for a world of hurt when they are blindsided by the reality that the opposite is true. Conditions are set for a huge rally.
— Peter Schiff (@PeterSchiff) July 12, 2026


