కొత్త రూపంలో IRCTC వెబ్‌సైట్! | Trains Ticket Booking Will Be Faster Know The New IRCTC Website | Sakshi
Sakshi News home page

కొత్త రూపంలో IRCTC వెబ్‌సైట్!

Jul 13 2026 5:33 PM | Updated on Jul 13 2026 5:40 PM

Trains Ticket Booking Will Be Faster Know The New IRCTC Website

ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో వచ్చే సమస్యలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇప్పుడు భారతీయ రైల్వే.. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను పూర్తిగా కొత్త రూపంలోకి తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

రైలు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో వెబ్‌సైట్ నెమ్మదించడం, సర్వర్ సమస్యలు రావడం, టికెట్ బుక్ అయ్యేలోపు సీట్లు అయిపోవడం వంటి సమస్యలను చాలామంది ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు భారతీయ రైల్వే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను కొత్తగా మారుస్తోంది.

జులై 15 నుంచి కొత్త వెర్షన్
కొత్త వెబ్‌సైట్ బీటా వెర్షన్ 2026 జూలై 15 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వేగంగా టికెట్ బుక్ చేసుకోవడం, సులభమైన నావిగేషన్, మెరుగైన పనితీరు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

నిజానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌పై ప్రయాణికుల నుంచి లెక్కకుమించిన ఫిర్యాదులు అందాయి. అందులో ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఒకేసారి లక్షలాది మంది ప్రయత్నించడం వల్ల వెబ్‌సైట్ స్లో అవ్వడం, పేజీలు లోడ్ కాకపోవడం, ఎక్కువసార్లు క్యాప్చా అడగడం, సెషన్ టైమ్ అవుట్ కావడం వనవి ఉన్నాయి. కొత్త వెబ్‌సైట్‌ ఈ సమస్యలకు చెక్ పెట్టనున్నట్లు సమాచారం.

మొబైల్ యాప్‌లో కూడా..
కొత్త వెబ్‌సైట్‌ను ఐఆర్‌సీటీసీ, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక కొత్త ఫీచర్లను ఇందులో చేర్చారు. బీటా వెర్షన్‌ను టెస్ట్ చేసే సమయంలో వినియోగదారుల నుంచి వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

కొత్త ఐఆర్‌సీటీసీ ఫీచర్లు రైల్‌వన్ మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి. అంటే వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఏదైనా ప్రయాణికులకు ఒకే విధమైన అనుభవం లభిస్తుంది. వెబ్‌సైట్ మార్పులతో పాటు భారతీయ రైల్వే తన పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను కూడా అప్డేట్ చేస్తోంది. దాదాపు 40 ఏళ్ల నాటి ఈ వ్యవస్థ స్థానంలో అధిక ట్రాఫిక్‌ను నిర్వహించగల కొత్త సాంకేతిక వ్యవస్థను తీసుకురానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement