IRCTC చైర్మన్ రాజీనామా | IRCTC CMD Sanjay Kumar Jain Resigns | Sakshi
Sakshi News home page

IRCTC చైర్మన్ రాజీనామా

Jun 23 2026 8:57 PM | Updated on Jun 23 2026 8:57 PM

IRCTC CMD Sanjay Kumar Jain Resigns

1990 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ అధికారి సంజయ్ కుమార్ జైన్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు.

సంజయ్ కుమార్ జైన్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది, కానీ ఆయన 2026 జూలై 20 వరకు తన పదవిలో కొనసాగుతారు. 2024 ఫిబ్రవరి 14న ఐఆర్‌సీటీసీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన జైన్ నాయకత్వంలో.. సంస్థ టికెట్ బుకింగ్, పర్యాటక సేవలు, క్యాటరింగ్‌తో సహా వివిధ రంగాలలోకి విస్తరించింది.

విలక్షణమైన మార్కెటింగ్ కార్యక్రమాల ద్వారా విలాసవంతమైన రైలు 'మహారాజాస్ ఎక్స్‌ప్రెస్'కు ఒక కొత్త కోణాన్ని ఇవ్వడంలో జైన్ కీలక పాత్ర పోషించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విమానాశ్రయ లాంజ్‌ల తరహాలో భారతదేశపు మొట్టమొదటి 'ఎగ్జిక్యూటివ్ లాంజ్'ను ప్రారంభించడంలో కూడా ప్రమేయం కీలకం. ఈయన  నాయకత్వంలో ఐఆర్‌సీటీసీ పర్యాటక వ్యాపారం భారీగా వృద్ధి చెందింది.

జైన్ చేసిన సేవలకు గాను, రైల్వే మంత్రిత్వ శాఖ ఆయనను రెండుసార్లు సత్కరించింది. భారతీయ రైల్వేలో అత్యున్నత పురస్కారమైన 'రైల్వే మంత్రి పురస్కారం' ఆయన విశిష్ట సేవలకు గాను ప్రదానం చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement