పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్ | Tamil Serial Actress Syamantha Kiran Marries Anand Selvan | Sakshi
Sakshi News home page

Syamantha Kiran: నటుడి కంటే నటి ఏడేళ్ల పెద్ద.. కానీ పెళ్లి

Jun 18 2026 4:31 PM | Updated on Jun 18 2026 4:43 PM

Tamil Serial Actress Syamantha Kiran Marries Anand Selvan

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. తెలుగు, తమిళ, హిందీ.. ఏ భాషలో అయినా సరే నటీనటుల ప్రేమ పెళ్లిళ్ల గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాయి. ఈ ఏడాది టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ-రష్మిక ఒక్కటయ్యారు. ఇప్పుడు వీళ్ల బాటలో తమిళ సీరియల్ జంట ఏడడుగులు వేశారు. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీళ్లు.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

(ఇదీ చదవండి: 'బాహుబలి' రమ్యకృష్ణ సెకండ్ లవ్)

తమిళంలో ప్రసారమవుతున్న అయలి సీరియల్ ఫేమ్ ఆనంద్ సెల్వన్.. ఒన్నా ఇరుక్కు కత్తుక్కణం సీరియల్ ఫేమ్ షియామంత కిరణ్‌ని పెళ్లి చేసుకున్నాడు. కోయంబత్తూరులో గురువారం ఉదయం ఈ శుభకార్యం జరగ్గా.. తమిళ సీరియల్ నటీనటులు చాలామంది విచ్చేశారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.

2019లో వచ్చిన ఆయుధ ఎళుత్త సీరియల్‌లో ఆనంద్, షియామంత కలిసి నటించారు. ఇందులో ఆనంద్ హీరో కాగా షియామంత ఓ సహాయ పాత్ర చేసింది. ఇది చేస్తున్నప్పుడు ఇద్దరు మధ్య మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆనంద్ కంటే షియామంత ఏడేళ్ల పెద్ద అని తెలుస్తోంది. అయినా సరే వయసు.. ఈ వివాహానికి అడ్డంకి కాలేదని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement