రమ్యకృష్ణ సెకండ్ లవ్.. ఇలా షాకిచ్చిందేంటి? | Senior Actress Ramya Krishnan Makes Grand OTT Debut With Web Series Second Love, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Ramya Krishna: రమ్యకృష్ణ సెకండ్ లవ్.. ఇలా షాకిచ్చిందేంటి?

Jun 18 2026 7:32 AM | Updated on Jun 18 2026 9:26 AM

Senior actress Ramya Krishna grand entry into Ott web series

ఓటీటీలు వచ్చాక ఇబ్బడిముబ్బడిగా సినిమాలు, సిరీస్‌లు క్యూ కడుతున్నాయి. ఆడియన్స్‌ అభిరుచికి తగినట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ అందిస్తున్నాయి. అయితే ఓటీటీల్లో నేరుగా విడుదలయ్యే సినిమాల్లో కేవలం చిన్న హీరోల చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికొస్తే పెద్దగా స్టార్స్ కనిపించరు. కొంత పేరున్న నటీనటులే ఉన్నప్పటికీ అగ్రతారలెవరు ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసిన సందర్భాలు చాలా తక్కువే.

కానీ ఇప్పుడంతా సీన్ మారిపోయింది. ఒకప్పటి స్టార్స్ సైతం ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ సైతం ఓటీటీల్లోకి అరంగేట్రం చేస్తోంది. దీంతో రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్‌  సెకండ్ లవ్. ఈ సిరీస్‌ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. సెకండ్ లవ్ అంటే ప్రేమ, వ్యామోహం అనే కాన్సెప్ట్‌తోనే ఈ సిరీస్‌ ఉండనుందని టైటిల్ వింటేనే అర్థమవుతోంది. ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఏదేమైనా రమ్యకృష్ణ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో టాలీవుడ్ అభిమానులు షాకవుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement