ప్రముఖ సీరియల్ నటి దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా దంపతులు శుభవార్త చెప్పేశారు. తమకు మంగళవారం కవల మగబిడ్డలు జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మేము ఆనందాన్ని కోరుకున్నాం. దేవుడు 'డబుల్‌గా తీసుకోండి' అన్నాడు. మా జీవితంలోకి కవల మగబిడ్డలు వచ్చారు' అని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్‌లో నిషేధం)
కొన్ని నెలల క్రితం దివ్యాంక తాను ప్రెగ్నెన్సీతో ఉన్న సంగతి బయటపెట్టింది. దాదాపు ఆరు నెలల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచామని ఆమె చెప్పుకొచ్చింది. మాకు ఇప్పుడు బిడ్డ కావాలని అనిపించింది. ప్రయత్నించాం… దేవుడు ఆశీర్వదించాడు అని అప్పట్లో ఆమె చెప్పింది. ఇప్పుడు ఇద్దరబ్బాయిలకు తల్లయింది. 'యే హై మొహబ్బతేన్' సీరియల్ షూటింగ్ టైంలో దివ్యాంక, వివేక్ ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. 2016 జూలై 8న పెళ్లి చేసుకున్నారు.
(ఇదీ చదవండి: ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్‌తో ఈమెకు సంబంధమేంటి?)


