ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్‌తో ఈమెకు సంబంధమేంటి? | Mumaith Khan Links WIth Pakistan And Her Present Updates | Sakshi
Sakshi News home page

Mumaith Khan: సడన్‌గా సినిమాలు చేయడం ఎందుకు ఆపేసింది?

May 26 2026 2:59 PM | Updated on May 26 2026 3:03 PM

Mumaith Khan Links WIth Pakistan And Her Present Updates

'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అని అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్. ఒక్క సాంగ్‌తో తెలుగులో ఈమె ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది. ఐదారేళ్ల పాటు తెలుగులో అప్పటి స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. అలాంటి ముమైత్ అసలేమైపోయింది? ఇప్పుడేం చేస్తోంది? ఈమెకు పాకిస్తాన్‌ ఉన్న సంబంధమేంటి?

(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)

ముమైత్ ఖాన్ పుట్టి పెరిగిందంతా ముంబైలో. ‍ఈమె అసలు పేరు ఇది కాదు ముంతాజ్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరుని ముమైత్ అని మార్చుకుంది. 2001లో రిలీజైన తమిళ మూవీ 'మజ్ను'తో ఐటమ్ డ్యాన్సర్‌గా అరంగేట్రం చేసింది. తెలుగులో అయితే హరికృష్ణ హీరోగా నటించిన 'సామి'తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఛత్రపతి, యోగి, సామాన్యుడు, ఎవడైతే నాకేంటి, ఆపరేషన్ దుర్యధన, నేనింతే, మగధీర తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. ఓ హీరో మూవీ వస్తుందంటే ముమైత్ పాట కచ్చితంగా ఉండాల్సిందే అనే రేంజుకి వెళ్లింది. అలా 2006-11 మధ్య కాలంలో ఏడాది ఐదారు సినిమాలు చేసింది.

ఐటమ్ సాంగ్సే కాదు మైసమ్మ ఐపీఎస్, మంగతాయారు టిఫిన్ సెంటర్ లాంటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లో లీడ్ రోల్స్ కూడా చేసింది. అలాంటి ఉన్నట్లుండి ఒక్కసారిగా ఈమె సినిమాల్లో కనిపించడం మానేసింది. దీని గురించి ఓ సందర్భంలో మాట్లాడిన ముమైత్.. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు సినిమాలు మానేశానని అంతా అనుకున్నారు. కానీ నేనెప్పుడూ సినిమాలు మానలేదు, మానాలని అనుకోలేదు. యాక్సిడెంట్ జరిగింది. నా మెదడులో 5 నరాలు చిట్లాయి. ఈ ప్రమాదం తర్వాత కనీసం ఏడేళ్లు పని చేయకూడదని డాక్టర్లు చెప్పారు. చిన్న వస్తువు మోయడం కూడా చాలా కష్టంగా అనిపించేది.

ఈ ప్రమాదం తర్వాత 15 రోజుల పాటు కోమాలో ఉన్నాను. దేవుడు  నన్ను ముమైత్ ఖాన్‌గా మార్చాడు. ఆయనే దీనంతటికీ ఫుల్‌స్టాప్ పెట్టమని హింట్ ఇచ్చాడు. దాన్ని నేను అంగీకరించాను. ఏడేళ్ల పాటు నన్ను నేను తెలుసుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించాను. ఈ సమయంలో నన్ను మా అమ్మే చూసుకుంది. నన్ను సంతోషంగా ఉంచడానికి ఏం చేయాలో అన్నీ చేసింది. నా లైఫ్ స్టైల్‌ని మారకుండా చూసుకుంది. ఈ ఏడేళ్లలో నాకేం ఇష్టమనే విషయాలను బాగా తెలుసుకున్నా. నేను బిజీగా ఉన్నప్పుడు హెయిర్ స్టైలింగ్‌కి, మేకప్ కిట్స్‌కి, స్టైయిలింగ్ టీమ్స్‌ని ముంబై నుంచి తెప్పించాల్సి వచ్చేది. వాటిని హైదరాబాద్‌లోనే ఎందుకు ఏర్పాటు చేయకూడదనే ఆలోచనతోనే వ్యాపారం మొదలెట్టా. ఇప్పుడు అదే నా కెరీర్‌గా ఎంచుకున్నానని గతంలో ముమైత్ చెప్పుకొచ్చింది.

ఇక వ్యక్తిగత విషయానికొస్తే ముమైత్ తల్లిది తమిళనాడు కాగా తండ్రిది పాకిస్తాన్. ముమైత్ పుట్టిన తర్వాత వీళ్ల కుటుంబం ముంబైకి వచ్చేసింది. 13 ఏళ్ల వయసు నుంచే పని చేయడం మొదలెట్టిన ముమైత్ ఖాన్, చిన్నతనంలో ఆకలి కష్టాలని కూడా అనుభవించింది. బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్‌లో పాల్గొంది కానీ డ్రగ్స్ కేసు వల్ల మధ్యలో బయటకొచ్చి మళ్లీ షోలోకి వెళ్లింది. కానీ 49వ రోజు ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అడపాదడపా వీడియోలు చేయడం తప్పితే కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు.

(ఇదీ చదవండి: ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్‌పై సముద్రఖని కామెంట్స్)

Advertisement
 
Advertisement
Advertisement