ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్‌పై సముద్రఖని కామెంట్స్ | Samuthirakani Reacts Cm Vijay Latest Update | Sakshi
Sakshi News home page

Cm Vijay Samuthirakani: విజయ్ మంచి చేస్తారు కానీ ఆ ఫలితాలు బాధించాయి

May 26 2026 1:41 PM | Updated on May 26 2026 1:54 PM

Samuthirakani Reacts Cm Vijay Latest Update

తమిళనాడు ముఖ్యమంత్రిగా కొన్నిరోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హీరో విజయ్.. తన రోజువారీ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఆయన గెలుపు గురించి ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నటుడు, దర్శకుడు సముద్రఖని కూడా తనదైన శైలిలో సీఎం విజయ్ గురించి మాట్లాడారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)

ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన సముద్రఖని.. విజయ్ రాజకీయ అనుభవంపై వచ్చిన విమర్శలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'తమిళనాడు ప్రజలు సినీ ఇండస్ట్రీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అందించారు. దీనిపై నాకు చాలా ఆనందంగా ఉంది. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు(విజయ్) ఏం అర్హత ఉందని చాలామంది ప్రశ్నించారు. అయితే ఆ అర్హత ఉందని చెప్పుకొనే వాళ్లు ప్రజల కోసం ఏం చేశారు? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవాళ్లు మరింత జాగ్రత్తగా, ప్రజల కోసం మంచి చేస్తారనే నమ్మకం నాకు ఉంది' అని అన్నారు.

తమిళనాడు ఎన్నికల ఫలితాలని సునామీతో పోల్చిన ఈయన..'ఈ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, అహంకారం ఏమీ గెలవలేదు. ప్రజలు అజ్ఞానులు అని కొందరు భావించారు. కానీ వాళ్లే ఎంతో తెలివిగా వ్యవహరించారు. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని చివరకు డబ్బు ఇవ్వని పార్టీకి ఓటేశారు. అయితే ఈ ఫలితాల్లో స్టాలిన్ సర్, పళనివేళ్ త్యాగరాజ్ అన్న, సీమన్ అన్న ఓడిపోవడం నాకు బాధ కలిగించింది. తిరుమావళన్ అన్నకు పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సింది. అప్పుడు గెలిచేవారు. అన్నామలై ఇంకొంత కాలం ప్రజల్లో తిరుగుంటే బాగుండేది. ఈ సునామీ కొన్ని మంచి విషయాల్ని కూడా తీసుకెళ్లిపోయింది' అని సముద్రఖని చెప్పుకొచ్చారు.

తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా వరస సినిమాలు చేస్తున్న సముద్రఖని ప్రస్తుతం వెట్రిమారన్ 'అరసన్' మూవీలో నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం 'కార్మేని సెల్వం' మూవీతో వచ్చారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.

(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)

Advertisement
 
Advertisement
Advertisement