జాన్వీ కపూర్ చెప్పిన బెస్ట్ వెయిట్ లాస్ టిప్ | Janhvi Kapoor Fun Comment On Ram Charan Goes Viral During Peddi Promotions, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: అలా చేస్తే సగం రోజులోనే సన్నబడిపోతారు

May 26 2026 11:29 AM | Updated on May 26 2026 12:11 PM

Janhvi Kapoor Weight Loss Tip Dance Along Ram charan

సాధారణ ప్రజలు నచ్చినవి నచ్చినట్లు తినేస్తుంటారు కానీ సినిమా సెలబ్రిటీలకు ఇలాంటివి కుదరదు. మూవీల్లో చేసే పాత్ర కోసం పక్కా డైట్ మెంటైన్ చేస్తూ బాడీ ఫిట్‌గా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. జాన్వీ కపూర్ కూడా ఇప్పుడు అలాంటి ఓ బెస్ట్ వెయిట్ లాస్ టిప్ చెప్పింది. 'పెద్ది' చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాన్ని పంచుకుంది.

(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్‌లో నిషేధం)

జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న సినిమా 'పెద్ది'. రామ్ చరణ్ హీరో కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. కొన్నిరోజుల క్రితం ముంబైలో ట్రైలర్ లాంచ్ చేయగా.. రీసెంట్‌గా భోపాల్‌లో ఐటమ్ గీతాన్ని ఆవిష్కరించారు. సోమవారం బెంగళూరులోని మరో ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమంలోనే హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'రామ్ చరణ్ సర్‌తో ఓ పాటలో గనక మీరు డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తే సగం రోజులోనే బక్కగా అయిపోతారు' అని చెప్పుకొచ్చింది.

జాన్వీ ఇలా చెబుతున్నప్పుడు ఎదురుగా కూర్చుని ఉన్న రామ్ చరణ్ సిగ్గు పడిపోతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'పెద్ది' చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కొందరిని మాత్రమే ఆకట్టుకుంది. మాస్ మూమెంట్స్ కంటే స్టోరీని చూపించడంతో కొందరు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఐటమ్ సాంగ్‌కి కూడా మిశ్రమ స్పందనే వచ్చింది.

(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)

Advertisement
 
Advertisement
Advertisement