Item dancer
-
ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్‌తో ఈమెకు సంబంధమేంటి?
'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అని అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్. ఒక్క సాంగ్‌తో తెలుగులో ఈమె ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది. ఐదారేళ్ల పాటు తెలుగులో అప్పటి స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. అలాంటి ముమైత్ అసలేమైపోయింది? ఇప్పుడేం చేస్తోంది? ఈమెకు పాకిస్తాన్ ఉన్న సంబంధమేంటి?(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)ముమైత్ ఖాన్ పుట్టి పెరిగిందంతా ముంబైలో. ఈమె అసలు పేరు ఇది కాదు ముంతాజ్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరుని ముమైత్ అని మార్చుకుంది. 2001లో రిలీజైన తమిళ మూవీ 'మజ్ను'తో ఐటమ్ డ్యాన్సర్‌గా అరంగేట్రం చేసింది. తెలుగులో అయితే హరికృష్ణ హీరోగా నటించిన 'సామి'తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఛత్రపతి, యోగి, సామాన్యుడు, ఎవడైతే నాకేంటి, ఆపరేషన్ దుర్యధన, నేనింతే, మగధీర తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. ఓ హీరో మూవీ వస్తుందంటే ముమైత్ పాట కచ్చితంగా ఉండాల్సిందే అనే రేంజుకి వెళ్లింది. అలా 2006-11 మధ్య కాలంలో ఏడాది ఐదారు సినిమాలు చేసింది.ఐటమ్ సాంగ్సే కాదు మైసమ్మ ఐపీఎస్, మంగతాయారు టిఫిన్ సెంటర్ లాంటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లో లీడ్ రోల్స్ కూడా చేసింది. అలాంటి ఉన్నట్లుండి ఒక్కసారిగా ఈమె సినిమాల్లో కనిపించడం మానేసింది. దీని గురించి ఓ సందర్భంలో మాట్లాడిన ముమైత్.. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సినిమాలు మానేశానని అంతా అనుకున్నారు. కానీ నేనెప్పుడూ సినిమాలు మానలేదు, మానాలని అనుకోలేదు. యాక్సిడెంట్ జరిగింది. నా మెదడులో 5 నరాలు చిట్లాయి. ఈ ప్రమాదం తర్వాత కనీసం ఏడేళ్లు పని చేయకూడదని డాక్టర్లు చెప్పారు. చిన్న వస్తువు మోయడం కూడా చాలా కష్టంగా అనిపించేది.ఈ ప్రమాదం తర్వాత 15 రోజుల పాటు కోమాలో ఉన్నాను. దేవుడు నన్ను ముమైత్ ఖాన్‌గా మార్చాడు. ఆయనే దీనంతటికీ ఫుల్స్టాప్ పెట్టమని హింట్ ఇచ్చాడు. దాన్ని నేను అంగీకరించాను. ఏడేళ్ల పాటు నన్ను నేను తెలుసుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించాను. ఈ సమయంలో నన్ను మా అమ్మే చూసుకుంది. నన్ను సంతోషంగా ఉంచడానికి ఏం చేయాలో అన్నీ చేసింది. నా లైఫ్ స్టైల్‌ని మారకుండా చూసుకుంది. ఈ ఏడేళ్లలో నాకేం ఇష్టమనే విషయాలను బాగా తెలుసుకున్నా. నేను బిజీగా ఉన్నప్పుడు హెయిర్ స్టైలింగ్‌కి, మేకప్ కిట్స్‌కి, స్టైయిలింగ్ టీమ్స్‌ని ముంబై నుంచి తెప్పించాల్సి వచ్చేది. వాటిని హైదరాబాద్‌లోనే ఎందుకు ఏర్పాటు చేయకూడదనే ఆలోచనతోనే వ్యాపారం మొదలెట్టా. ఇప్పుడు అదే నా కెరీర్‌గా ఎంచుకున్నానని గతంలో ముమైత్ చెప్పుకొచ్చింది.ఇక వ్యక్తిగత విషయానికొస్తే ముమైత్ తల్లిది తమిళనాడు కాగా తండ్రిది పాకిస్తాన్. ముమైత్ పుట్టిన తర్వాత వీళ్ల కుటుంబం ముంబైకి వచ్చేసింది. 13 ఏళ్ల వయసు నుంచే పని చేయడం మొదలెట్టిన ముమైత్ ఖాన్, చిన్నతనంలో ఆకలి కష్టాలని కూడా అనుభవించింది. బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో పాల్గొంది కానీ డ్రగ్స్ కేసు వల్ల మధ్యలో బయటకొచ్చి మళ్లీ షోలోకి వెళ్లింది. కానీ 49వ రోజు ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అడపాదడపా వీడియోలు చేయడం తప్పితే కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు.(ఇదీ చదవండి: ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్‌పై సముద్రఖని కామెంట్స్) View this post on Instagram A post shared by Mumtaz Khan (@mumait) -
అదిరేటి స్టెప్పు మీరేస్తే...!
నందమూరి బాలకృష్ణ ఏ సినిమా వేడుకలో పాల్గొన్నా ‘ఓ డైలాగ్ కొట్టు గురూ’ అని అభిమానులు అభిమానంగా అడుగుతారు. ఒకవేళ అదే వేదికపై జ్యోతిలక్ష్మి లాంటి ఐటమ్ డ్యాన్సర్ కూడా కనిపిస్తే, ఆమెతో కలిసి ఓ స్టెప్ వెయ్ గురూ అని అడిగినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఒకప్పుడు ‘జ్యోతిలక్ష్మి చీర కట్టింది... పాపం చీరకే సిగ్గేసింది..’, ‘అంతం కాదిది.. ఆరంభం.. మూడు చుక్కల ముద్దుల విందు...’, ‘పరువాల లోకం.. పడుచోళ్ల మైకం..’ వంటి ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను కనువిందు చేసిన జ్యోతిలక్ష్మిని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేరు. ఆమెతో కలిసి బాలకృష్ణ నిజంగానే డ్యాన్స్ చేశారు. ఇందుకు వేదికగా నిలిచింది ‘సంతోషం’ అవార్డుల వేడుక. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో జ్యోతిలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో ఏయన్నార్ స్మారక అవార్డును కృష్ణంరాజు, గోల్డెన్ జూబ్లీ అవార్డును కృష్ణ, జీవిత సాఫల్య పురస్కారాన్ని విజయనిర్మల, డి. రామానాయుడు స్మారక అవార్డును అల్లు అరవింద్ , అల్లు రామ లింగయ్య స్మారక అవార్డును గొల్లపూడి మారుతీ రావు, ఈవీవీ స్మారక అవార్డును రేలంగి నరసింహా రావు అందు కున్నారు. 2014 లెజెండ్రీ అవార్డు అందుకున్న బాలకృష్ణ అభిమానుల కోరిక మేరకు తన సినిమాలోని కొన్ని డైలాగ్స్ చెప్పారు. అదే అభిమానుల కోరిక మేరకు జ్యోతిలక్ష్మీతో కలిసి ‘గు గ్గు గ్గు గ్గు గ్గుడెసుంది..’ పాటకు స్టెప్పులు వేశారు. అదిరేటి ఈ స్టెప్పులు అవార్డు వేడుకకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యాయని ‘సంతోషం’ సురేశ్ కొండేటి పేర్కొన్నారు. ఇంకా కథానాయిక శ్రీయ చేసిన డ్యాన్స్ కూడా వీక్షకులను అలరించింది. ఈ వేడుకలో నటులు మురళీ మోహన్, రామ్‌చరణ్, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, వీవీ వినాయక్, ఎన్. శంకర్, కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పలువురు తారలకు అవార్డులు అందజేశారు.


