తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో సురేఖావాణి కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె మన దగ్గర పెద్దగా చిత్రాలేం చేయట్లేదు గానీ తమిళంలో కాస్త బిజీగానే ఉంటోంది. అలా ఈమె నటించిన 'నిరమ్' తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో పెళ్లి గురించి సురేఖావాణికి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె సమాధానం కూడా ఇచ్చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా.. 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)
గతంలో మీ అమ్మాయి, మీకు ఇష్టమైతే మళ్లీ పెళ్లి చేస్తానని చెప్పింది. దీనిపై మీరేం అంటారు అని ఓ రిపోర్టర్ సురేఖావాణిని ప్రశ్నించగా.. 'ఆ ఆలోచన అయితే లేదు. ఉండుంటే ఇన్నిరోజులు వెయిట్ చేయాల్సిన అవసరముండేది కాదు. ప్రస్తుతానికి ఆలోచన లేదు. ఇక మీదట కూడా ఉండదనే అనుకుంటున్నాను. మా అమ్మాయికి పెళ్లి చేసే వయసొచ్చింది. నేనేం పెళ్లి చేసుకుంటాను? నా పెళ్లి, ప్రెస్ వాళ్లు ఎప్పుడో చేసేశారు. రాసేశారు కూడా' అని నవ్వుతూ సమాధానమిచ్చింది.
చాలా ఏళ్లుగా సురేఖావాణి నటిగా కొనసాగుతుండగా.. ఈమె కూతురు సుప్రీత కూడా ఇండస్ట్రీలోకి వచ్చింది. హీరోయిన్‌గా పలు చిన్న చిత్రాలు చేస్తోంది. అయితే సురేఖావాణి పెళ్లిపై గతంలోనూ పలుమార్లు ఇలానే రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు పూర్తి క్లారిటీ ఇచ్చేయడంతో ఇకనైనా పుకార్లు ఆగుతాయేమో చూడాలి? ఇక సోషల్ మీడియాలో పెట్టే గ్లామరస్ ఫొటోలు, వీడియోల గురించి స్పందించిన ఈమె.. నాకు ఏ పోస్ట్ పెట్టాలనిపిస్తే అది పెడతా ఎలా ఫొటో దిగాలనిపిస్తే అలా దిగుతా. చుట్టుపక్కల ఏమనుకుంటారో నాకు అనవసరం. మనది ఏంటి... నేను ఏంటి... నాకేంటి... అంతే! అని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: మహేశ్ అన్న కొడుకు సినిమా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)


