సినీ తారలు డైట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆర్యోగంగా, ఫిట్‌గా ఉండేందుకు కొలతలు వేసుకొని మరీ ఆహారం తీసుకుంటారు. అయితే కొంతమందికి మాత్రం విచిత్రమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొంతమంది నాన్‌వెజ్ సైడే చూడరు. మరికొంతమందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. అలాంటి వారిలో వరుణ్ తేజ్ కూడా ఒకడు.
ఈ హీరో ప్రతి రోజు చికెన్ లేదా మటన్ తింటాడట. రెగ్యులర్ డైట్‌లో అది కచ్చితంగా ఉండాల్సిందేనట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెబుతూ.. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను పంచుకున్నాడు.
‘నాన్ వెజ్ లేకుండా నేను తినలేను. చిన్నప్పుడు ఒక్క పూట చికెన్ పెట్టలేదని రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నా. దీంతో మరుసటి రోజు పరీక్ష సరిగా రాయక ఫెయిల్ అయిపోయా. చికెన్ అంటే అంత ఇష్టం. వీటితో పాటు పీతలు, చేపలు, రొయ్యలు కూడా బాగానే తింటా’అని వరుణ్ చెప్పుకొచ్చాడు.
సినిమా విషయాలకొస్తే.. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు రిలీజ్‌కి రెడీగా ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, సత్య కీలక పాత్ర పోషించాడు. ఆగస్ట్ 7న ఈ చిత్రం విడుదల కానుంది.


