బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ | Actress Reba Monica John Blessed With Baby Girl | Sakshi
Sakshi News home page

Reba John: శుభవార్త చెప్పిన హీరోయిన్ రెబా

Jul 28 2026 7:02 PM | Updated on Jul 28 2026 7:11 PM

Actress Reba Monica John Blessed With Baby Girl

తెలుగులో తక్కువ సినిమాలే చేసినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెబా మోనికా జాన్ ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. బేబీ ఫొటోని కూడా షేర్ చేసి పేరు కూడా పెట్టినట్లు వెల్లడించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా.. తెలుగులోనూ)

రెబా మోనికా స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో సామజవరగమన, మృత్యుంజయ్, మ్యాడ్ స్క్వేర్ తదితర సినిమాల్లో నటించింది. ఈ ఏడాది ఏప్రిల్ చివరలో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. థాయ్‌లాండ్‌లోని బీచ్‌లో భర్తతో దిగిన ఫొటోలని షేర్ చేసింది. తాము ముగ్గురు కాబోతున్నామని చెప్పింది. ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది.

2022లో జోమన్ జోసెఫ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న రెబా మోనికా జాన్.. 2016లో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 20 వరకు సినిమాలు చేసింది. చివరగా ‍ఈ ఏడాది మార్చి తొలివారం వచ్చిన 'మృత్యుంజయ్'లో పోలీస్ అధికారిగా నటించింది. ఇకపోతే తనకు కూతురు పుట్టిన విషయాన్ని చెబుతూ కియారా అని పేరు పెట్టినట్లు తెలిపింది. బిడ్డని ఎత్తుకున్న ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది.

(ఇదీ చదవండి: రామ్ చరణ్‌కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement