ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా విదేశీ భాషలకు చెందిన హారర్, థ్రిల్లర్ మూవీస్ కూడా అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ కొరియన్ హారర్ చిత్రం దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగులోనూ స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ 'మైఖేల్'.. అధికారిక ప్రకటన)
2024లో రిలీజైన కొరియన్ హారర్ సినిమా 'ఘోస్ట్ ట్రైన్'. ఇప్పుడు ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. దాదాపు గంటన్నర నిడివితో ఉండే ఈ మూవీలో సోషల్ మీడియా, మనుషుల్ని ఎలా తయారు చేస్తుంది? లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలు ఎలా రిస్క్‌లో పెడుతున్నారు? అనే అంశాన్ని ఇందులో చూపించారు.
'ఘోస్ట్ ట్రైన్' విషయానికొస్తే.. హారర్, సూపర్ నేచురల్ స్టోరీలపై ఓ యూట్యూబర్ వీడియోలు చేస్తూ ఉంటుంది. కానీ పెద్దగా వ్యూస్ రావు. ఓసారి భయంకరమైన కొన్ని రూమర్స్ వినిపించే స్టేషన్‌కి వెళ్తుంది. ఆ స్టేషన్ మాస్టర్ ఈమెకు నాలుగు స్టోరీలు చెబుతాడు? ఇంతకీ అవేంటి? చివరకు ఈమెకు ఏమైంది? అనేది మిగతా స్టోరీ.
ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే రావు బహదూర్, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, దీవాన, లవ్ ఓ లవ్ లాంటివి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అలానే అబ్జెషన్ మై లార్డ్, ఆజాదీ 501, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా ఈ వీకెండే అందుబాటులోకి రానున్నాయి.
(ఇదీ చదవండి: రామ్ చరణ్‌కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)


