రాజకీయాలకు, సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నటీనటులు చాలామంది రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, విజయ్ లాంటి వాళ్లు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయిపోయారు. అయితే హీరో విజయ్.. తమిళ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈయన కొన్ని సీట్లు గెలిస్తే గొప్ప అనుకున్నారు. కానీ సీఎం అయ్యేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఈయనకు అధికారం రావడం మాటేమో గానీ తమిళ హీరోలు ఒకరి తర్వాత రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని బయటపెడుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి విశాల్ చేరిపోయాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ సినిమా.. తెలుగులోనూ)
రీసెంట్ టైంలో కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ తనకున్న రాజకీయ ఆసక్తిని బయటపెట్టేలా మాట్లాడగా.. హీరో ధనుష్ ఏకంగా పెద్ద సభని ఏర్పాటు చేశాడు. తాజాగా విశాల్ కూడా ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ తాను సొంతం చేసుకున్న మంచి పేరును ప్రజా సేవకు ఉపయోగించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా. మీరు చూపిన అభిమానానికి.. మీకు తిరిగి ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నా. ఇకపై నా ప్రయాణం సాధారణంగా ఉండదు. ఎలాంటి అడ్డదారులు లేకుండా నేరుగా, నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నా. ఆ మార్గంలో ప్రయాణిస్తూ అన్ని రంగాల్లో మీకు అండగా ఉంటానని విశాల్ అన్నాడు. దీంతో ఈ హీరో కూడా త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఇస్తారని మాట్లాడుకుంటున్నారు.
అయితే విజయ్‌కి కలిసొచ్చినట్లు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మిగతా తమిళ హీరోలకు పరిస్థితులు కలిసొస్తాయా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే విజయ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. ధనుష్, విశాల్ లాంటి హీరోలకు ఉన్న అభిమాన గణం వేరు. చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లోకి చాలామంది హీరోలు వచ్చేలా కనిపిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?
(ఇదీ చదవండి: రామ్ చరణ్‌కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)
#Vishal 🔥 pic.twitter.com/L6gFlHmgab
— Cine World Entertainment 🌍 (@CineWorldEnt) July 28, 2026


