వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీల విజయవంతంపై వైఎస్‌ జగన్‌ హర్షం | YSRCP Chief YS Jagan Hails Mega Success of YSRCP Statewide Protests | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీల విజయవంతంపై వైఎస్‌ జగన్‌ హర్షం

Jul 28 2026 5:55 PM | Updated on Jul 28 2026 6:30 PM

YSRCP Chief  YS Jagan Hails Mega Success of YSRCP Statewide Protests

తాడేపల్లి : డీఎస్సీ పేపర్‌ లీకేజీ, స్పోర్ట్స్‌ కోటా పేరిట అన్యాయాలపై వైఎస్సార్‌సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీల విజయవంతంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ  మేరకు అన్ని జిల్లాల్లోనూ బారీగా జరిగిన నిరసన ప్రదర్శనపై వీడియోను పోస్టు చేశారు వైఎస్‌ జగన్‌.

‘చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసిందన్నారు. విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు  విజయవంతమయ్యాయని, డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

పేపర్‌ లీకేజీ నుంచి స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపైన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే.  టీచర్‌ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వ.. డీఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు క‌ళ్ల ఎదుటే క‌నిపిస్తా ఉన్నా  సీఎం చంద్రబాబు కానీ, విద్యాశాఖమంత్రి లోకేష్ కానీ ఇప్పటివరకూ వాటిమీద నోరుమెదపలేదు. డైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి:

  ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు

దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాటం (ఫొటోలు)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement